కోలీవుడ్‌లో పరుత్తివీరన్ చిత్రంతో కథానాయకుడిగా పరిచయం అయిన కార్తీ ఇప్పటికి 24 చిత్రాల్లో నటించారు. వీటిలో 90 శాతం హిట్ చిత్రాలు కావడం విశేషం. ఇటీవల కార్తీ నటించిన విరుమాన్, పొన్నియిన్ సెల్వన్, సర్దార్ చిత్రాలు వరుసగా విడుదలై హిట్ కావడంతో హ్యాట్రిక్ సాధించారు. కాగా తాజాగా తన 25వ చిత్రం జపాన్ పూర్తి చేశారు. వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడు రాజు మురుగన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నటి అనూ ఇమాన్యుల్ నాయకిగా నటిస్తున్న జపాన్ చిత్ర టైటిల్‌కు విశేష స్పందన వచ్చింది.
(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రెడీ)
అదేవిధంగా ఇందులో కార్తీ వివిధ గెటప్పులు ధరించడంతో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాల్లో జరుపుకుంటున్న ఈ చిత్రంలోని పాటల చిత్రీకరణ జరగాల్సి ఉంది. కాగా దీపావళి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. కాగా విచిత్ర వ్యాపారం ట్రేడ్ వర్గాల్లో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. జపాన్ చిత్ర ప్రీ బిజినెస్ మాత్రమే రు.150 కోట్లు జరిగిందని చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి.
(ఇదీ చదవండి: ఫీమేల్ గెటప్‌లో మెప్పించేందుకు ప్లాన్ చేస్తున్న హీరోలు)
ఇప్పటివరకు కార్తీ నటించిన చిత్రాలన్నిటికంటే అత్యధికంగా వ్యాపారం జరిగిన చిత్రం ఇదే అవుతుంది. కాగా నటుడు కార్తీ ప్రస్తుతం తన 26వ చిత్రంలో నటిస్తున్నారు. దీనికి నలన్ కుమార సామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ అక్టోబర్‌లో పూర్తి అవుతుందని సమాచారం. తదుపరి 96 చిత్రం ఫ్రేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇది నవంబర్‌లో సెట్ పైకి వెళ్లనుంది ఆ తర్వాత కార్తీ నటించే సర్దార్– 2, ఖైదీ– 2 చిత్రాలు 2024లో ప్రారంభం అవుతాయని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment