కేజ్రీవాల్‌పై ట్విట్టర్‌ జనాల దాడి | twitteratti slam arvind kejriwal over uri tweet | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్‌పై ట్విట్టర్‌ జనాల దాడి

Published Thu, Sep 29 2016 8:13 AM | Last Updated on Sat, Aug 25 2018 6:37 PM

కేజ్రీవాల్‌పై ట్విట్టర్‌ జనాల దాడి - Sakshi

కేజ్రీవాల్‌పై ట్విట్టర్‌ జనాల దాడి

సోషల్ మీడియాలో తన భావాలను ఎప్పటికప్పుడు చెబుతూ, ట్విట్టర్ ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాలే ఆయుధంగా ఉద్యమాలు నిర్మించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఆ ట్విట్టరే పెద్ద షాకిచ్చింది. ఉడీ ఉగ్రదాడిని కూడా రాజకీయాలకు వాడుకోవాలనుకున్న కేజ్రీవాల్‌పై ట్విట్టర్ జనాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో ఒక జాతీయ పత్రికలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ.. ''అద్భుతమైన కథనం. ఉడీ దాడి విషయంలో అంతర్జాతీయంగా పాకిస్థాన్ కాదు, భారతదేశమే ఒంటరి అయిపోతున్నట్లు కనిపిస్తోంది'' అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఒక్కసారిగా ట్విట్టర్‌ జనాలలో కలకలం రేగింది. పాకిస్థానీ పౌరులకు ఆయన ట్వీట్ ఒక ఆయుధంలా దొరికింది. భారతదేశం గురించి తమ ఆలోచనలను సమర్థించే నాయకుడు ఒకరు దొరికారని వాళ్లు సంబరపడ్డారు.

విషయం ఏమిటంటే, ఇస్లామాబాద్‌లో నవంబర్ నెలలో నిర్వహించే సార్క్ సదస్సుకు హాజరు కాకూడదని భారతదేశం నిర్ణయించుకున్న తర్వాత.. అదే బాటలో అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్ కూడా సదస్సును బహిష్కరించాయి. దాంతో ప్రస్తుతం సార్క్ అధ్యక్ష పదవిలో ఉన్న నేపాల్.. సదస్సు వేదికను మార్చాలని భావించడం పాకిస్థాన్‌ను మరింత ఇబ్బందిలోకి నెట్టేసింది. కానీ కేజ్రీవాల్ మాత్రం ఈ పరిస్థితికి పూర్తి భిన్నంగా వ్యవహరించడంతో భారతీయులతో పాటు ఇతర దేశాలలో వాళ్లు కూడా ఆయనను తీవ్రంగా విమర్శించారు. సార్క్ సదస్సుకు మోదీ రాకపోతే.. ఆయన బదులు కేజ్రీవాల్ రావచ్చుగా అని కొందరు అంటే, భారతీయులు అసలు కేజ్రీవాల్‌కు బుర్ర ఉందా.. ఆయనకు సలహాలు ఇచ్చేవాళ్లు ఎవరు అంటూ రకరకాలుగా మండిపడ్డారు. మరికొందరు తీవ్ర అసభ్య పదజాలంతో కూడా కేజ్రీవాల్‌ను దూషించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement