ఉగ్రవాదులకు జపాన్ వైర్ లెస్ సెట్లు ఎలా? | Japanese wireless sets expose Pakistan link to Uri attack | Sakshi
Sakshi News home page

ఉగ్రవాదులకు జపాన్ వైర్ లెస్ సెట్లు ఎలా?

Published Sun, Sep 25 2016 8:51 AM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM

ఉగ్రవాదులకు జపాన్ వైర్ లెస్ సెట్లు ఎలా? - Sakshi

ఉగ్రవాదులకు జపాన్ వైర్ లెస్ సెట్లు ఎలా?

ఊడి/శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని ఊడి సెక్టార్ పై ఉగ్రదాడి పాకిస్థాన్ సైన్యానికి తెలిసే జరిగిందని నిరూపించేలా మరోసాక్ష్యం వెలుగులోకొచ్చింది. ఉగ్రదాడికి పాల్పడి బలగాల కాల్పుల్లో హతమైన ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో రెండు జపాన్ కు చెందిన వైర్ లెస్ సెట్ లు లభ్యం అయ్యాయని జాతీయ దర్యాప్తు సంస్థ తెలిపింది. వాటిపై 'బిల్కుల్ నయా'(బ్రాండ్ న్యూ) అనే పేరిట రాసి ఉందని చెప్పారు. ఐసీఓఎం అనే తయారీ సంస్థ నుంచి వీటిని కొనుగోలు చేశారని ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఆధారాలు సంపాధించింది.

అయితే వాస్తవానికి 'ఏ దేశంలోనైనా వైర్ లెస్ సెట్లు కేవలం రక్షణ సంస్థలకు మాత్రం అమ్ముతారు. ఇలాంటివి ఇప్పటికే పాకిస్థాన్ లో విక్రయిస్తున్నారనే విషయాన్ని మేం తెలుసుకుంటున్నాం. ఈ విషయాన్ని త్వరలోనే పాక్ అధికారులకు అధికారికంగా చేరవేస్తాం' అని హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. ఉగ్రవాదుల నుంచి మొత్తం 48 వస్తువులు బలగాలు స్వాధీనం చేసుకొని ఎన్ఐఏకు అప్పగించగా వాటిని పరిశీలన చేస్తోంది. అందులో మ్యాపులు, ముందుగుండు సామాగ్రి ఇతర వస్తువులు లభించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement