న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి యురిదాడి ఘటనపై సమీక్షిస్తున్నారు. సోమవారం ప్రధాని తన అధికారం నివాసం రేసు కోర్సు రోడ్డు 7లో మంత్రులు, అధికారులతో భేటీ అయ్యారు.
హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జమ్ము కశ్మీర్లో యురి సైనికస్థావరంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 20 మంది జవాన్లు వీరమరణం పొందగా, సైనికులు నలుగురు ముష్కరులను హతమార్చారు. ఈ దాడిని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఏ చర్యలు తీసుకోవాలన్నదానిపై ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయిస్తారు.
యురిదాడిపై ప్రధాని మోదీ సమీక్ష
Published Mon, Sep 19 2016 12:41 PM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM
Advertisement