మోదీపై శివసేన ఫైర్
ముంబై: శివసేన మరోసారి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పై తీవ్ర స్థాయిలో మండిపడింది. మోదీ పనితీరు గత కాంగ్రెస్ పాలన కంటే దారుణంగా ఉందని అందుకే ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని శివసేన అధికార పత్రిక సామ్నాలో విమర్శించింది. మోదీ అంతర్జాతీయంగా పాకిస్థాన్ చర్యలను ఎండగట్టడంలో విఫలమయ్యారని ఆరోపించింది.
కశ్మీర్ లో నిరంతరం పాకిస్థాన్ జెండా ఎగరడం, అనుకూల నినాదాలు వినిపిస్తుండటం పరిపాటిగా మారిందని పేర్కొంది. పఠాన్ కోట్ దాడి అనంతరం సరైన చర్యలు తీసుకోకపోవడమే యురీ ఘటనకు కారణమని స్పష్టం చేసింది. ఉగ్రదాడికి సాక్షాలను అంతర్జాతీయంగా చూపినా లాభం ఉండదని ఒసామా బిన్ లాడెన్ ను ఏరివేసేందుకు అమెరికా పాక్ లో చేసిన దాడిని గుర్తు చేసింది. భారత్ తన సైన్యాలను పాక్ పై ప్రయోగించాలని డిమాండ్ చేసింది.