సాక్షి, హైదరాబాద్ : యూరియా 50 కేజీల బస్తాకు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడింది. ఇక నుంచి 2, 5, 10, 25, 45 కేజీల బస్తాలు అందుబాటులోకి రానున్నాయి. యూరి యా వాడకాన్ని తగ్గించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి మంగళవారం లేఖ రాశారు. బస్తా పరిమాణం తగ్గిస్తే బస్తాకు 5 కేజీల చొప్పున వాడకం తగ్గుతుందని చెప్పారు. ఈ విషయమై జిల్లాల్లో ఎరువుల దుకాణాదారులకు అవగాహన కల్పించాలని, అందుకు ఎరువుల డీలర్లతో సమావేశం నిర్వహించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment