ప్రస్తుతం సరిహద్దులో భారత సైనికుల పరిస్థితి
న్యూఢిల్లీ: భారత జవాన్లకు ప్రస్తుతం నిద్ర లేదు.. సెలవులు లేవు... సరిహద్దు భూభాగంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశ జవాన్లు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. నియంత్రణ రేఖ వెంబడి పరిస్థితులు దినదిన గండంగా సాగుతున్నాయి. సైనికులు అప్రమత్తంగా ఉంటున్నారు. విధులను నిర్వర్తిస్తున్నారు. ఉడీ ఉగ్ర దాడి అనంతరం భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ నుంచి ఎప్పుడు, ఏ రకంగా ముప్పు వాటిల్లుతుందోనని అత్యంత హైఅలర్ట్‌తో భారత్ సైన్యం మెలుగుతోంది. ఖాళీ సమయాల్లో చేసే అన్ని పనులకు మన జవాన్లు చెక్ చెప్పారు.
ఉన్నతాధికారుల ఆదేశాలను అనుసరించడమే ప్రస్తుతం వారి ముందున్న ప్రధాన విధి. సైనికులకు సెలవులు దొరకడం మాట అటుంచితే కనీసం సరిగా నిద్రపోవడానికి కూడా సమయం లేకుండా పోయింది. ఇదివరకు సైనికులు 6 గంటలు నిద్రపోయేవారు కానీ తాజా పరిస్థితుల్లో కనీసం 4 గంటలు కూడా నిద్రపోవడం లేదు. నిద్రాహారాలు మాని నియంత్రణ రేఖ వద్ద నిత్యం పెట్రోలింగ్ చేస్తూ సరిహద్దును కాపాడే పనిలో భారత ఆర్మీ పూర్తి స్థాయిలో నిమగ్నమైంది.
నిద్ర లేదు.. సెలవు లేదు...
Published Mon, Oct 3 2016 2:26 AM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM
Advertisement
Advertisement