'సర్జికల్ స్ట్రైక్స్ ఏ మాత్రం సరిపోవు'
'సర్జికల్ స్ట్రైక్స్ ఏ మాత్రం సరిపోవు'
Published Mon, Oct 3 2016 9:07 AM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM
ఫ్రాంకోయిస్ హోరో(43) ఉడీ ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడిన భారత సైనికుడు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో 22 రోజుల పాటు ప్రాణాలకోసం పోరాడి తుదిశ్వాస విడిచారు. హోరో మృతితో ఉడీ దాడిలో మృతి చెందిన భారత సైనికుల సంఖ్య 20 కు చేరింది. ఆయన అంత్యక్రియలను ఆదివారం స్వస్థలం జార్కండ్లోని లాలి గ్రామంలో నిర్వహించారు. హోరో మృతితో ఆయన కుటుంబసభ్యులు (తల్లి, భార్య, ఇద్దరు కూతుళ్లు) తీవ్ర విషాదంలో మిగిలిపోయారు.
హోరో అంత్యక్రియల సందర్భంగా లాలి గ్రామంలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. గ్రామస్తులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హోరో పెద్ద కూతురు అనూ మాట్లాడుతూ.. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని, దానికి భారత్ చేపట్టిన సర్జికల్ దాడులు ఏ మాత్రం సరిపోవని అన్నారు.
Advertisement