శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో జవాను అరెస్ట్‌ | Soldier arrested at srinagar airport with grenades | Sakshi
Sakshi News home page

శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో జవాను అరెస్ట్‌

Published Mon, Apr 3 2017 7:38 PM | Last Updated on Mon, Oct 22 2018 8:34 PM

Soldier arrested at srinagar airport with grenades

శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ విమానాశ్రయంలో ఓ జవాను గ్రెనేడ్లతో రావడం కలకలం సృష్టించింది. ఉరీ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వహించే ఓ జవాను సోమవారం ఢిల్లీ వెళ్లేందుకు శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. విమానం ఎక్కబోతున్న అతడ్ని పోలీసులు తనిఖీ చేయగా.. అతని బ్యాగులో రెండు గ్రెనేడ్లను గుర్తించారు.

దీంతో అప్రమత్తమైన అధికారులు అతడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. జవానును పశ్చిమ బెంగాల్‌కు చెందిన భూపాల్‌ ముఖియాగా పోలీసులు గుర్తించారు. ఆ గ్రెనేడ్లను జవాను ఢిల్లీలోని ఓ వ్యక్తికి అప్పజెప్పేందుకు వెళ్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అటు ఆర్మీగానీ, ఇటు పోలీసులు గానీ అధికారికంగా వెల్లడించలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement