పాక్‌పై సైన్యం భారీ ప్రతీకారం.. రహస్య ఆపరేషన్‌! | Indian army operation in PoK | Sakshi
Sakshi News home page

పాక్‌పై సైన్యం భారీ ప్రతీకారం.. రహస్య ఆపరేషన్‌!

Published Thu, Sep 22 2016 7:21 PM | Last Updated on Sat, Mar 23 2019 8:40 PM

పాక్‌పై సైన్యం భారీ ప్రతీకారం.. రహస్య ఆపరేషన్‌! - Sakshi

పాక్‌పై సైన్యం భారీ ప్రతీకారం.. రహస్య ఆపరేషన్‌!

ఉడీ ఉగ్రవాద దాడితో రగిలిపోతున్న భారత సైన్యం అప్పుడే ప్రతీకారం తీర్చుకుందా? పాకిస్థాన్‌లో ఓ భారీ కోవర్ట్‌ ఆపరేషన్‌ నిర్వహించి 20 మంది పాకిస్థానీ ఉగ్రవాదుల్ని ఏరిపారేసిందా? అంటే తాజాగా 'క్వింట్‌.కామ్‌' లో ప్రచురితమైన ఓ కథనం ఔననే అంటోంది.

ఈ కథనం ప్రకారం భారత ఆర్మీకి చెందిన అత్యున్నత పారా మిలిటరీ యూనిట్లు రెండు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లో ఓ రహస్య ఆపరేషన్‌ నిర్వహించాయి. 18 మంది సైనికుల్ని పొట్టనబెట్టుకున్న ఉడీ ఉగ్రవా దాడి జరిగిన రెండు రోజుల తర్వాత.. సెప్టెంబర్‌ 20-21 అర్ధరాత్రి ఈ ఆపరేషన్‌ జరిగింది. హెలికాప్టర్లలో 18 నుంచి 20 సైనికులు పీవోకేలో అడుగుపెట్టి.. ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి. ఈ దాడుల్లో కనీసం 20 మంది పాకిస్థానీ ఉగ్రవాదులు హతమయ్యారు.

అయితే, 'క్విట్‌.కామ్‌' ప్రచురించిన ఈ ప్రత్యేక కథనాన్ని అటు రక్షణశాఖ అధికారులుగానీ, ప్రభుత్వ వర్గాలు కానీ ధ్రువీకరించడం లేదు. అయినప్పటికీ తమ కథనం ప్రామాణికమైనదేనని, ఆర్మీలోని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఈ ఆపరేషన్‌ నిజంగానే జరిగిందని 'క్వింట్‌.కామ్‌' స్పష్టం చేయడం గమనార్హం. ఆర్మీలోని ఉన్నత వర్గాలు స్పందిస్తే తప్ప.. ఈ కథనం ప్రామాణికమైనదని నమ్మలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement