
ఉడీ బ్రిగేడ్ కమాండర్ బదిలీ
జమ్మూకశ్మీర్: సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఉడీ బ్రిగేడ్ కమాండర్ను బదిలీ చేస్తూ ఆర్మీ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 18 తెల్లవారుజామున ఉడీ సైనిక స్థావరంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 19 మంది సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే.
ఎల్ఓసీకి సమీపంలో ఉన్న ప్రతిష్టాత్మక సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి జరపడంలో భద్రతా బలగాల అలసత్వం కూడా ఉందనే విమర్శలు దేశవ్యాప్తంగా వినిపించాయి. దీనిపై విచారణ చేపట్టిన ఆర్మీ.. ఉడీ బ్రిగేడ్ కమాండర్ కే సోమశేఖర్ స్థానంలో 28 మౌంటెయిన్ డివిజన్కు చెందిన ఆఫిసర్కు బాధ్యతలు అప్పగించింది. అయితే దీనిపై మరింత సమాచారం ఇచ్చేందుకు ఆర్మీ అధికారులు నిరాకరించారు.