పాక్ జాతీయ పతాకాన్ని నేలపైన వేసి తొక్కుతున్న దృశ్యం
పాక్ చర్యపై ఆగ్రహించిన విద్యార్థి లోకం
Published Mon, Sep 19 2016 11:49 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
యూనివర్సిటీ క్యాంపస్: జమ్మూకశ్మీర్‌లోని యూరీ సెక్టార్‌లో పాకిస్తాన్ సైన్యం భారత సైనికులను ఊచకోత కోయడంపై విద్యార్థి లోకం ఆగ్రహించింది. వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వి.హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం బాలాజీకాలనీలోని జ్యోతిరావు పూలే సర్కిల్ వద్ద ఆందోళన చేశారు. ప్రాణాలు కోల్పోయిన భారత సైనికులకు నివాళి అర్పించారు. మౌనం పాటించారు. పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ దిష్టిబొమ్మ తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. హరిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి శాంతియుత దేశంగా పేరుందని, అలాంటి దేశంపై పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించడం దారుణమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మురళీధర్, నరేంద్ర, ప్రదీప్, నవీన్‌గౌడ్, హేమంత్‌కుమార్ రెడ్డి, సతీష్‌రెడ్డి, మునికుమార్, సాయి, మూలాలి, అభిషేక్, సిద్దిక్ పాల్గొన్నారు
Advertisement