భారత్‌ కాల్పుల్లో ఇద్దరు పాక్‌ జవాన్ల హతం | Indian Army foils ambush by Pakistan's Border Action Team in Uri, two attackers gunned down | Sakshi
Sakshi News home page

ఇద్దరు పాక్‌ జవాన్లను హతమార్చిన ఆర్మీ

Published Fri, May 26 2017 3:41 PM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM

Indian Army foils ambush by Pakistan's Border Action Team in Uri, two attackers gunned down

జమ్ము: పాకిస్తాన్‌ మరోసారి కాల్పులు విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. అయితే పాకిస్తాన్‌కు భారత సైన్యం ధీటుగా సమాధానమిచ్చింది. జమ్ముకశ్మీర్‌లోని యురీ సెక్టార్‌లో పాకిస్తాన్‌ బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌కు చెందిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడింది. అప్రమత్తమైన భారత జవాన్లు పాక్‌ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టారు.

ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్‌ కాల్పులను భారత్‌ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. కాగా గతంలో పాక్‌ బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌ సభ్యులు పలుమార్లు జవాన్లతో పాటు భారత్‌ పోస్టులపై తెగబడ్డారు. అంతేకాకుండా భారత్‌ జవాన్ల దేహాలను అత్యంత కిరాతంగా చింధ్రం చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement