మరో సైనికుడు వీర మరణం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో యూరి సైనిక స్థావరంపై పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీర మరణం పొందిన సైనికుల సంఖ్య 18కి చేరింది. సిపాయి కె. వికాస్ జనార్థన్.. ఢిల్లీలోని ఆర్ ఆండ్ ఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఉగ్రదాడిలో మృతి చెందిన సిపాయిల సంఖ్య 20కి చేరిందని వచ్చిన వార్తలను రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రి తోసిపుచ్చారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మందికి కాలిన గాయాలయ్యాయని చెప్పారు. వీరిలో ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఆస్పత్రికి తరలించినట్టు వెల్లడించారు. మిగతావారికి కశ్మీర్ లోనే చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.
మృతి చెందిన సైనికుల వివరాలు..
1. సుబేదార్ కర్నైల్ సింగ్(జమ్మూకశ్మీర్)
2. హవిల్దార్ రవి పాల్(జమ్మూకశ్మీర్)
3. హవిల్దార్ ఎన్ ఎస్ రావత్(రాజస్థాన్)
4. సిపాయి జావ్రా ముండా(జార్ఖండ్)
5. సిపాయి నైమాన్ కుజుర్(జార్ఖండ్)
6. సిపాయి రాజేశ్ సింగ్(బిహార్)
7. హవిల్దార్ అశోక్ కుమార్ సింగ్(బిహార్)
8. నాయక్ ఎస్ కే విదార్థి(బిహార్)
9. సిపాయి బిశ్వజిత్ గొరాయ్ (పశ్చిమ బెంగాల్)
10. సిపాయి గంగాధర్ దులాయ్(పశ్చిమ బెంగాల్)
11. లాన్స్ నాయక్ ఆర్ కే యాదవ్(ఉత్తరప్రదేశ్)
12. సిపాయి హరిందర్ యాదవ్(ఉత్తరప్రదేశ్)
13. సిపాయి గణేశ్ శంకర్(ఉత్తరప్రదేశ్)
14. సిపాయి రాజేశ్ కేఆర్ సింగ్(ఉత్తరప్రదేశ్)
15. లాన్స్ నాయక్ జి. శంకర్(మహారాష్ట్ర)
16. సిపాయి టీఎస్ సోమనాథ్(మహారాష్ట్ర)
17. సిపాయి ఉయికి జాన్రావు(మహారాష్ట్ర)
18. కె. వికాస్ జనార్థన్