అప్పుడు వచ్చిన నోళ్లు ఇప్పుడేమయ్యాయి?
పాకిస్థానీ నటీనటులు భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్లిపోవాలన్న తమ నిర్ణయాన్ని మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి (ఎంఎన్ఎస్) మరోసారి స్పష్టం చేసింది. వ్యక్తిగతంగా తమకు ఏ ఒక్కరిపైనా ఎలాంటి ద్వేషం లేదని, కానీ.. కళను దేశాన్ని వేరు చేయడం సాధ్యం కాదని ఎంఎన్ఎస్ ప్రతినిధి అమే ఖోప్కర్ అన్నారు.
పాక్ నటీనటులను భారతదేశంలో చాలా గౌరవిస్తారని చెబుతూ.. ప్యారిస్‌లోను, సిరియాలోను ఉగ్రదాడులు జరిగినప్పుడు ఈ పాక్ నటులంతా స్పందించి, బాధితులకు సంఘీభావంగా ట్వీట్లు చేశారని, మరి ఉడీలో ఉగ్రవాదులు దాడిచేసి భారతీయ సైనికుల ప్రాణాలను బలిగొన్నప్పుడు వీళ్ల నోళ్లు ఏమైపోయాయని ఖోప్కర్ ప్రశ్నించారు. అందుకే ఉంటున్న దేశమంటే గౌరవం లేని వాళ్లు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.