‘అమర జవాన్లకు ఆర్థిక చేయూతనిద్దాం’ | Honouring martyred soldiers not enough, help their families with money, appeals Akshay Kumar | Sakshi
Sakshi News home page

‘అమర జవాన్లకు ఆర్థిక చేయూతనిద్దాం’

Published Tue, Sep 20 2016 8:23 PM | Last Updated on Sat, Aug 25 2018 3:57 PM

‘అమర జవాన్లకు ఆర్థిక చేయూతనిద్దాం’ - Sakshi

‘అమర జవాన్లకు ఆర్థిక చేయూతనిద్దాం’

ముంబై: వీరమరణం పొందిన అమర జవాన్ల సేవలను కొనియాడడంతోనే సరిపెట్టకుండా వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు రావాలని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కోరాడు. మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారి కుటుంబాలకు చేతనైనంత సహాయం చేయడం మనందరి బాధ్యత అని పేర్కొన్నాడు.

‘సైనికులు అందించిన సేవలకు పతకాలు ఇచ్చి గౌరవించడం మంచిదే. ఈ గౌరవాలు అందుకోవడానికి అన్నివిధాల వారు అర్హులు. కానీ డబ్బు కూడా వారికి చాలా అవసరం. మనం కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఆర్థికంగా తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రతి ఒక్కరు ఈ విధంగా ముందుకు రావాల’ని అక్షయ్ కుమార్ కోరారు. యూరి ఉగ్రవాదుల దాడిలో అమరులైన సైనికుల కుటుంబాలకు ఆర్థికంగా చేయూత అందించాలని విజ్ఞప్తి చేశాడు. ఆర్మీ అంటే ఇష్టపడే అక్షయ్ కుమార్.. బాబి, రుస్తుం, ఎయిర్ లిఫ్ట్, స్పెషల్ 26 వంటి దేశభక్తి కలిగిన సినిమాల్లో నటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement