martyred soldiers
-
గాల్వాన్ అమర జవాన్ తండ్రికి అవమానం.. ఇంట్లో నుంచి ఈడ్చుకొచ్చిన పోలీసులు
రెండేళ్ల కిత్రం గాల్వాన్ లోయలో చైనాతో జరిగిన హింసాత్మక ఘర్షణలో అమరుడైన బిహార్ సైనికుడు జై కిషోర్ సింగ్ తండ్రికి అవమానకర ఘటన ఎదురైంది. ప్రభుత్వ స్థలంలో కొడుకు కోసం స్మారకాన్ని నిర్మించినందుకు సింగ్ తండ్రిపై బిహార్ పోలీసులు అమానుషంగా ప్రవరించారు. ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి దూషించారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అసలేం జరిగిందంటే.. వైశాలి జిల్లా జండాహాలోని కజారి బుజుర్గ్ గ్రామానికి చెందిన రాజ్ కపూర్ సింగ్ కుమారుడు జై కిషోర్ సింగ్ 2020లో గాల్వన్ లోయలో చైనా బలగాలతో జరిగిన ఘర్షణలో అమరుడయ్యాడు. గతేడాది ఫిబ్రవరిలోనే సింగ్ కుటుంబ సభ్యులు తమ ఇంటి ముందు ఉన్న ప్రభుత్వ భూమిలో సైనికుడి స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఆవిష్కరించే కార్యక్రమంలో అనేకమంది ప్రభుత్వ అధికారులు కూడా పాల్గొన్నారు. అనంతరం గతేడాది డిసెంబర్లో దీని చుట్టూ గోడ కట్టారు. అయితే ప్రభుత్వ భూమిలో అక్రమంగా స్మారకం ఏర్పాటు చేశారని ఆరోపిస్తూ సోమవారం అర్థరాత్రి పోలీసులు రాజ్ కపూర్ సింగ్ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి అతనిపై చేయిచేసుకున్నారు. అంతేగాక సింగ్‌ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.ఇందులో పోలీసులు సైనికుడి తండ్రి రాజ్ కపూర్ సింగ్‌ను ఇంట్లో నుంచి ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది.. అంతేగాక పోలీసులు సింగ్‌ను కొట్టారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అరెస్ట్ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్మారక స్తూపం వద్దకుచ ఏరుకొని పోలీసుల చర్యకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఈ ఆరోపణలను పోలీసులు ఖండించారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా స్మారకం ఏర్పాటు చేశారని రాజ్ కపూర్ సింగ్ ఇంటి పక్కనే ఉండే హరినాథ్ రామ్ ఫిర్యాదు చేశారని తెలిపారు. తన భూమితోపాటు ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా విగ్రహాన్ని నిర్మించారని చెబుతూ.. హరినాథ్ రామ్ ఫిర్యాదు ఆధారంగా రాజ్ కపూర్ సింగ్‌పై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్డిపిఓ మహువా తెలిపారు. అంతేగాక సైనికుడి స్మారకం కారణంగా పొరుగువారు తమ పొలాల్లోకి వెళ్లకుండా అయ్యిందని గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదు మేరకే చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఆర్మీలో పనిచేస్తున్న అమరవీరుడు సైనికుడి సోదరుడు నంద కిషోర్ సింగ్ మాట్లాడుతూ.. డీఎస్పీ తమ ఇంటికి వచ్చి 15 రోజుల్లో విగ్రహాన్ని తొలగించాలని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే గత రాత్రి జండాహా పోలీసు స్టేషన్ ఇన్చార్జి తమ ఇంటికి వచ్చి తండ్రిని అరెస్టు చేసి లాక్కెళ్లరని తెలిపారు. తండ్రిని చెంపదెబ్బ కొట్టి దుర్భాషలాడారని, పోలీస్ స్టేషన్లోనూ దాడి చేశారని ఆరోపించారు. అర్థరాత్రి ఇంటికి వచ్చి ఒక తీవ్రవాదిలా అరెస్ట్ చేశారని వాపోయారు. Galwan valley martyr’s father being dragged by @bihar_police @yadavtejashwi @NitishKumar @SpVaishali pic.twitter.com/oJjUnqtQET — Anish Singh (@anishsingh21) February 26, 2023 -
‘మీ త్యాగం సమున్నతం’
సాక్షి, న్యూఢిల్లీ : చైనా సేనలతో సోమవారం రాత్రి జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన 20 మంది సైనికులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం సంతాపం తెలిపారు. అమరవీరుల సమున్నత త్యాగాలను ఆయన కొనియాడారు. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేందుకు అత్యున్నత త్యాగం చేసిన సైనికుల ధైర్యానికి సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నానని రాష్ట్రపతి కోవింద్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొన్నారు. లడఖ్‌లోని గాల్వన్ లోయలో నేలకొరిగిన సైనికులందరూ భారత సాయుధ దళాలు నెలకొల్పిన సంప్రదాయాలను సమున్నతంగా నిలబెట్టారని కొనియాడారు. వారి కుటుంబాలకు తాను ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని రాష్ట్రపతి పేర్కొన్నారు. చదవండి : కరోనాపై పోరులో రాష్ట్రపతి సాయం -
హోదాకు అహంభావమే అడ్డు
న్యూఢిల్లీ: ప్రాణాలర్పించిన జవాన్లకు అమరవీరుల హోదా ఇవ్వాలన్న తన విజ్ఞప్తిని అమలు చేసేందుకు ప్రధాని మోదీకి అహంభావం అడ్డు వస్తోందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా కనీసం సుప్రీంకోర్టు ఆదేశాలతోనైనా పారామిలటరీ బలగాలకు మెరుగైన జీతాలు అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సీఆర్పీఎఫ్కు జీతాల పెంపును వ్యతిరేకిస్తూ పుల్వామా ఉగ్రఘాతుకానికి కొన్ని రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు వచ్చిన వార్తను కూడా ఆయన షేర్ చేశారు. గత ఐదేళ్లలో సైనికుల ప్రాణాలను కాపాడటానికి మోదీ తీసుకున్న చర్యలేంటో చెప్పాలని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ప్రశ్నించారు. ఆక్రమిత అటవీ భూముల నుంచి ఆదివాసీలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసితులను ఖాళీ చేయించాలంటూ ఆయా రాష్ట్రాలకు సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు రాహుల్ లేఖలు రాశారు. -
ఈయనేం ఆ బాపతి హీరో కాడు
సాక్షి, ముంబై : మన హీరోలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారంటే.. ఆ సమయంలో ఖచ్ఛితంగా ఏదో ఆశించే వారు అలా చేసుంటారని కొంత మంది అనుకుంటుంటారు. ముఖ్యంగా సినిమా ప్రమోషన్ల సమయంలో వాళ్లు చేసే షకలు చూస్తే అలా అనుకోవటం తప్పేం లేదు. కానీ, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ అలాంటోడు అస్సలు కాదు. రియల్ లైఫ్‌లోనూ ఆయన్ను హీరోగా చెబుతుంటారు. ప్రభుత్వాలు కూడా అంతగా పట్టించుకోని అంశాలపై స్పందించి వాటిని వెలుగులోకి తెస్తూ.. తన వంతుగా సాయం కూడా చేస్తున్నాడు. గతంలో మహారాష్ట్ర రైతులకు సాయం, మరుగుదొడ్ల నిర్మాణానికి చేయూత.. మావోయిస్టుల దాడిలో చనిపోయిన జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం ఇవన్నీ ఆ కోవలోకే వస్తాయి. అలాంటి అక్కీ ఈ దీపావళికి కూడా మళ్లీ అలాంటి పనే చేశాడు. కోహ్లపూర్ స్పెషల్ ఐజీ విశ్వాస్ నంగరే పాటిల్ అమర వీరుల కుటుంబాల జాబితాను ఒకటి తయారు చేసి వారి కుటుంబాలకు మిఠాయిలు పంచాడు. ఈ విషయం తెలుసుకున్న అక్కీ ఆ జాబితాను తెప్పించుకుని స్వీట్లు, పిల్లలకు పుస్తకాలతోపాటు 25,000 రూపాయల చెక్కులను పంపించాడు. ‘‘దేశం కోసం మీకుటుంబాలు చేసిన త్యాగం మరువలేనిది. వాళ్లు ఈ పండగ పూట మీ మధ్య లేకపోవటంతో ఎంత బాధాకరమో అర్థం చేసుకోగలం. కానీ, వారి బలిదానాలకు గుర్తు చేసుకుంటూ నూతన ఉత్సాహంతో జీవితంలో మీరు ముందుకు సాగాలి. మీ కోసం పంపుతున్న ఈ చిరు కానుకలను ప్రేమతో ఆహ్వానిస్తారని ఆశిస్తున్నా’’ అంటూ ఓ సందేశంతో వాటిని పంపాడు. అమర వీరులకు కుటుంబాలకు ఇలా ఆర్థిక సాయం చేయటమే కాదు.. కొన్ని నెలల ఓ ప్రత్యేక యాప్ రూపకల్పన చేసి దాని ద్వారా ఇలా ఉన్న సాధారణ ప్రజలను ఆదుకునేందుకు ఈ కిలాడీ హీరో ప్రయత్నించాడు కూడా. -
‘అమర జవాన్లకు ఆర్థిక చేయూతనిద్దాం’
ముంబై: వీరమరణం పొందిన అమర జవాన్ల సేవలను కొనియాడడంతోనే సరిపెట్టకుండా వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ముందుకు రావాలని బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కోరాడు. మాతృభూమి రక్షణ కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారి కుటుంబాలకు చేతనైనంత సహాయం చేయడం మనందరి బాధ్యత అని పేర్కొన్నాడు. ‘సైనికులు అందించిన సేవలకు పతకాలు ఇచ్చి గౌరవించడం మంచిదే. ఈ గౌరవాలు అందుకోవడానికి అన్నివిధాల వారు అర్హులు. కానీ డబ్బు కూడా వారికి చాలా అవసరం. మనం కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించాలి. ఆర్థికంగా తన వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నాను. ప్రతి ఒక్కరు ఈ విధంగా ముందుకు రావాల’ని అక్షయ్ కుమార్ కోరారు. యూరి ఉగ్రవాదుల దాడిలో అమరులైన సైనికుల కుటుంబాలకు ఆర్థికంగా చేయూత అందించాలని విజ్ఞప్తి చేశాడు. ఆర్మీ అంటే ఇష్టపడే అక్షయ్ కుమార్.. బాబి, రుస్తుం, ఎయిర్ లిఫ్ట్, స్పెషల్ 26 వంటి దేశభక్తి కలిగిన సినిమాల్లో నటించాడు.