న్యూఢిల్లీ: ప్రాణాలర్పించిన జవాన్లకు అమరవీరుల హోదా ఇవ్వాలన్న తన విజ్ఞప్తిని అమలు చేసేందుకు ప్రధాని మోదీకి అహంభావం అడ్డు వస్తోందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా కనీసం సుప్రీంకోర్టు ఆదేశాలతోనైనా పారామిలటరీ బలగాలకు మెరుగైన జీతాలు అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సీఆర్‌పీఎఫ్‌కు జీతాల పెంపును వ్యతిరేకిస్తూ పుల్వామా ఉగ్రఘాతుకానికి కొన్ని రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు వచ్చిన వార్తను కూడా ఆయన షేర్ చేశారు. గత ఐదేళ్లలో సైనికుల ప్రాణాలను కాపాడటానికి మోదీ తీసుకున్న చర్యలేంటో చెప్పాలని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ప్రశ్నించారు. ఆక్రమిత అటవీ భూముల నుంచి ఆదివాసీలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసితులను ఖాళీ చేయించాలంటూ ఆయా రాష్ట్రాలకు సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు రాహుల్ లేఖలు రాశారు.
Comments
Please login to add a commentAdd a comment