martyr
-
Veer Bal Diwas: మొఘలులను ఎదిరించిన ఆ చిన్నారుల బలిదానానికి గుర్తుగా..
భారతదేశవ్యాప్తంగా ఈరోజు(డిసెంబర్ 26)న వీర్ బాల్ దివస్ జరుపుకుంటున్నారు. సిక్కుల పదవ గురువైన గురు గోవింద్ సింగ్ కుమారులు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్‌ల ధైర్యసాహసాలు, త్యాగానికి గుర్తుగా ప్రతీయేటా డిసెంబర్ 6న వీర్ బాల్దివస్ నిర్వహిస్తుంటారు.మతం, మానవత్వాలను రక్షించేందుకు తమ ప్రాణాలను త్యాగం చేసిన సమయంలో సాహిబ్జాదా జోరావర్ సింగ్ వయసు తొమ్మిదేళ్లు, సాహిబ్జాదా ఫతే సింగ్ వయసు ఆరేళ్లు కావడం విశేషం. 2022లో జనవరి 9న గురుగోవింద్ సింగ్(Guru Gobind Singh) ప్రకాష్ పర్వ్ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ బాలవీరుల త్యాగానికి గుర్తుగా దేశవ్యాప్తంగా వీర్‌బాల్ దివస్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.మొఘలుల పాలనలో..సిక్కుల పదవ గురువు గోవింద్ సింగ్‌కు అజిత్ సింగ్, జుజార్ సింగ్, జోరావర్ సింగ్, ఫతే సింగ్ అనే నలుగురు కుమారులున్నారు. 1699లో గోవింద్ సింగ్ ఖాల్సా పంత్‌ను స్థాపించారు. 1705లో పంజాబ్ మొఘలుల పాలనలో ఉంది. ఆ సమయంలో గురుగోవింద్ సింగ్‌ను పట్టుకునేందుకు మొఘలులు తమ శాయశక్తులా ప్రయత్నించారు. అయితే గురు గోవింద్ వారికి చిక్కలేదు. అతని భార్య మాతా గుజ్రీతో పాటు వారి కుమారులు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్‌లో ఒక రహస్య ప్రదేశం(Secret place)లో దాక్కున్నారు. అయితే వారింటిలోని వంటవాడు గంగు వారి గురించి సిర్హింద్ నవాబ్ వజీర్ ఖాన్‌కు తెలియజేశాడు. అప్పటికే గురుగోవింద్ సింగ్ కుమారులు బాబా అజిత్ సింగ్, బాబా జుజార్ సింగ్ మొఘలులతో జరిగిన యుద్ధంలో వీరమరణం పొందారు.చిన్నారుల బలిదానంనవాబ్ వజీర్ ఖాన్ గురుగోవింద్ సింగ్ భార్య గుజ్రీని, కుమారులు సాహిబ్జాదా జోరావర్ సింగ్, సాహిబ్జాదా ఫతే సింగ్‌లను హింసించాడు. మతం మారాలంటూ వారిపై ఒత్తిడి తీసుకువచ్చాడు. తరువాత వజీర్ ఖాన్ సాహిబ్జాదాస్ చిన్నారులిద్దరినీ గోడలో పూడ్చిపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న వారి తల్లి గుజ్రీ ప్రాణత్యాగం చేశారు. ఆ చిన్నారుల బలిదానాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం 2022లో ప్రతీయేటా డిసెంబర్ 26ను వీర్ బాల్ దివస్(Veer Bal Diwas)గా జరుపుకుంటున్నట్లు ప్రకటించింది. బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్‌లు 1705, డిసెంబర్ 26న అమరులయ్యారు. వీర్ బాల్ దివస్ భారతదేశ చరిత్రలోని ఒక అపూర్వ అధ్యాయాన్ని గుర్తు చేస్తుందని, రాబోయే తరాలకు సత్యధర్మాలకున్న ప్రాముఖ్యతను తెలియజేస్తుందని ప్రదాని మోదీ గతంలో పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Year Ender 2024: దుమ్మురేపిన 100 మంది డిజిటల్ స్టార్స్.. -
మణిపూర్ అల్లర్లు.. అమరుని కుటుంబాన్ని రక్షించిన బీఎస్ఎఫ్..
ఇంఫాల్: మణిపూర్ అల్లర్లలో బీఎస్ఎఫ్ జవాన్లు అల్లరి మూకలతో వీరోచితంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో సైన్యంలో పనిచేసి అమరుడైన సైనికుని కుటుంబాన్ని ఆందోళనకారుల నుంచి రక్షించారు. అమరవీరుని కుటుంబం నివసిస్తున్న మఫౌ గ్రామం ఆపదలో ఉందని గమనించి అక్కడకు చేరుకున్నారు. దేశానికి కాపాలా కాసిన అమరుని ఇంటికి జవాన్లు ప్రస్తుతం రక్షణ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలోని పిల్లలు, వృద్ధులు, స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. మణిపుర్‌లోని మఫౌ గ్రామానికి చెందిన పాయోటిన్సాట్ గైట్ బీఎస్ఎఫ్లో సబ్-ఇన్స్పెక్టర్గా పనిచేశారు. 2020 డిసెంబరు 1న కశ్మీర్‌లోని ఎల్వోసీ వద్ద చొరబడేందుకు ప్రయత్నించిన ముష్కరులను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడుతూ గైట్ అమరుడయ్యాడు. ఆయన తెగువకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం గైట్ స్వగ్రామం ఆపదలో ఉందని గుర్తించి బీఎస్ఎఫ్ జవాన్లు .. అల్లరి మూకలను పారదోలారు. ఆ గ్రామాన్ని రక్షించారు. ఇదీ చదవండి: రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడలకు షాక్.. ప్రసంగానికి డిప్యూటీ ఛైర్మన్ బ్రేక్ సురక్షిత ప్రాంతంలో ఉన్న గైట్ తండ్రి టోంగ్జాంగ్ గైట్.. బీఎస్ఎఫ్ జవాన్లు తమను, తమ గ్రామాన్ని కాపాడిన తీరును వివరించారు. ' దాదాపు 1000 మంది అల్లరిమూకలు మా గ్రామంపై దాడి చేశారు. దీనిని పసిగట్టిన మేము గ్రామంలో పిల్లలు, స్త్రీలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు అప్పటికే తరలించాము. దాడిని పసిగట్టిన బీఎస్ఎఫ్ జవాన్లు.. మా గ్రామానికి అండగా నిలబడ్డారు. కానీ అప్పటికే 50 శాతం ఇళ్లు కాలిబూడిదయ్యాయి.' అని తెలిపారు. 'అమరవీరుని కుటుంబం అయినందున రెండేళ్ల క్రితం మణిపూర్ సీఎం మమ్మల్ని ఇంటికి పిలిచి గౌరవించారు. రూ.5 లక్షల ఆర్థిక సహాయం కూడా చేశారు. కానీ మేము ఇప్పుడు ఈ దాడిలో బాధితులుగా మిగిలిపోయాము. మా ఇంటిని విడిచి వేరే ప్రాంతాల్లో ఉండాల్సి వస్తోంది.' అంటూ టోంగ్జాంగ్ గైట్ కన్నీటి పర్యంతమయ్యారు. తమ కోడలు హోనిల్హింగ్ గైట్ కూతుళ్ల చదువుల కోసం మేఘాలయాలో ఉన్నట్లు చెప్పాడు. తనకు ఇద్దరు 6, 3 ఏళ్ల వయస్సు కలిగిన మనవరాళ్లు ఉన్నట్లు చెప్పారు. మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. తమ కోడలు, మనవరాళ్లతో ఇక్కడే ఉండాలని ఉందని తెలిపారు. ఇదీ చదవండి: ఒకపక్క మణిపూర్ అల్లకల్లోలంగా ఉంటే.. 718 మంది వలస వచ్చారు.. కారణం ఏమై ఉంటుంది? -
నా భర్తతో పాటే నన్నూ.. చితిపైకి చేరిన భార్య
భోపాల్: ఏప్రిల్ 26వ తేదీ బుధవారం ఛత్తీస్‌గఢ్ దంతేవాడలో జరిగిన మావోయిస్టుల దుశ్చర్య.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. యాభై కేజీల మందుపాతరతో పది మంది డీఆర్జీ జవాన్లు, ఓ డ్రైవర్ బలిగొన్నారు మావోయిస్టులు. ఈ ఘటనలో అమరలైన జవాన్లకు ప్రభుత్వం తరపున గౌరవవందనం అందగా.. అనంతరం అయినవాళ్ల మధ్య అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే.. దంతేవాడ మావోయిస్టుల దాడిలో అమరుడైన డీఆర్జీ జవాన్ భార్య.. ఆత్మాహుతికి సిద్ధపడింది. భర్తతో పాటే తననూ చితి మీద కాల్చేయండంటూ గ్రామస్తులను, బంధువులను బతిమాలుకుందామె. ఆ దృశ్యం అందరినీ కంటతడి పెట్టింది. చివరికి ఆమెను అంతా బలవంతంగా చితిపై నుంచి బయటకు లాక్కొచ్చారు. భర్త మరణంతో తన బతుకు చీకట్లోకి కూరుకుపోయిందని, ఇంక తాను ఎవరి కోసం బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తోందామె. అమర జవాన్ లఖ్మూ మార్కం అంత్యక్రియలకు ఊరు ఊరంతా కదిలి వచ్చింది. షాహీద్ జవాన్.. అమర్ రహే అంటూ కన్నీటి నినాదాలతో అంతిమ యాత్ర నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణం పొగొట్టుకున్నందుకు నివాళి.. ఊరంతా లఖ్మూ మృతదేహాన్ని తాకి నివాళులర్పించారు. ఇదీ చదవండి: జనజీవన స్రవంతిలో కలిసి.. ఇప్పుడు బలైపోయారు! -
నోరు జారిన ఇమ్రాన్ ఖాన్, వెనకేసుకొచ్చిన..
ఈమధ్య వివాదాస్పద వ్యాఖ్యలతో పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రతీ అంశానికి భారత్‌ను ముడిపెట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. అయితే కిందటి ఏడాది పార్లమెంట్(జాతీయ అసెంబ్లీ) సాక్షిగా ఇమ్రాన్ చేసిన సీరియస్ కామెంట్లు.. ఇప్పుడు తెరపైకి వచ్చి దుమారం రేపుతున్నాయి. ఉగ్రసంస్థ అల్ ఖైదా వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ సమాజం దృష్టిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా పేరున్న ఒసామా బిన్ లాడెన్‌ను ‘అమరవీరుడి’గా ఇమ్రాన్ ఖాన్ పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇమ్రాన్‌ను వెనకేసుకొస్తున్నారు అక్కడి మంత్రులు. ఇస్లామాబాద్: ‘‘పాకిస్థాన్‌కు సమాచారం ఇవ్వకుండానే అమెరికా దళాలు ఇక్కడి గగనతలంలో అడుగుపెట్టాయి. అబ్బొట్టాబాద్ లో అక్రమంగా ఆపరేషన్ నిర్వహించి ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుపెట్టాయి. దీంతో లాడెన్ అమరుడయ్యాడు. ఆ సందర్భంలో మన దేశం చాలా ఇబ్బంది పడింద’’ని ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో ప్రసగించాడు. అయితే, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఇమ్రాన్‌ఖాన్‌పై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇమ్రాన్ కామెంట్లపై పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి వివరణిచ్చాడు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొరబాటున నోరుజారి ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చాడు. ఒసామా బిన్ లాడెన్ ను పాకిస్థాన్ ప్రభుత్వం ఎప్పటికీ ఓ ఉగ్రవాదిగానే భావిస్తుందని, అల్ ఖైదాను ఓ ఉగ్రవాద సంస్థగానే పరిగణిస్తామని ఫవాద్ స్పష్టం చేశాడు. అయినా, ఇమ్రాన్ వ్యాఖ్యలను వంకర కోణంలో చూస్తున్నారని పేర్కొన్నారు. పాక్ మీడియాలోని ఓ వర్గం దీన్ని భూతద్దంలో చూపిస్తోందని మండిపడ్డాడు. ఇంతకుముందు పాక్ విదేశాంగ మంత్రి ముహమ్మద్ ఖురేషీ కూడా.. ఇమ్రాన్ వ్యాఖ్యలు అసందర్భోచితమైనవని చెప్పాడు. అమెరికా భద్రతా దళాలకు భయపడి బిన్ లాడెన్ పాకిస్థాన్ లోని అబ్బొట్టాబాద్ లో తలదాచుకోగా, అమెరికా నేవీ సీల్స్ కమాండోలు 2011లో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి లాడెన్‌ను మట్టుపెట్టాయి. బాలీవుడ్‌ను కాపీ కొట్టకండి ఇదిలా ఉంటే బాలీవుడ్‌ను కాపీ కొట్టొద్దంటూ పాక్ ఫిల్మ్మేకర్లను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరాడు. ఇస్లామాబాద్‌లో జరిగిన షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన ఇమ్రాన్ ఖాన్.. పాకిస్థాన్ సినిమా.. బాలీవుడ్ వల్ల బాగా ప్రభావితం అయ్యిందని వ్యాఖ్యానించాడు. పాక్ సినిమా అక్కడి(భారత్) కల్చర్‌ను చూపిస్తోంది. ఇది పరోక్షంగా మరో దేశపు కల్చర్‌ను ప్రోత్సహించడమే అవుతుంది. ఇక్కడి నేటివిటీని చూపించే ప్రయత్నం చేయండి. సినిమాలు పోతాయని భయపడకండి. ఓటమికి భయపడితే గెలవలేం. నా స్వానుభవంతో చెప్తున్నా’ ఫిల్మ్ మేకర్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు ప్రధాని ఇమ్రాన్ ఖాన్. చదవండి: హిందీ హీరోయిన్‌తో ఇమ్రాన్ ఖాన్ చెట్టాపట్టాల్ -
‘వాడు అమాయకుడు.. అమరుడయ్యాడు’
గువాహటి/అసోం: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వ్యక్తమవుతున్న నిరసనల్లో సామ్ స్టాఫర్‌్డ అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. సంగీతాన్ని ప్రాణంగా భావించే అతడు.. తూటాల దాహానికి బలయ్యాడు. పౌరసత్వ చట్టానికి నిరసనగా ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో సామ్ మరణం నిరసనకారుల ఆవేదనను రెట్టింపు చేసింది. ‘నీవు అమరుడివయ్యావు. నీకు వందనం. జై అసోం’ అంటూ అశ్రునయనాలతో అతడికి శాశ్వత వీడ్కోలు పలికారు. ఇక బాధితుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన అసోంలో శుక్రవారం చోటుచేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. మేఘాలయకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ సైతం ఆందోళనకారులకు మద్దతు తెలుపుతూ సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం అసోంలోని నామ్‌గఢ్ ప్రాంతంలో నిరసనకారులకు సంఘీభావం తెలిపేందుకు ఓ కన్సర్ట్ ఏర్పాటు చేశాడు. అప్పటి వరకు మైదానంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సామ్.. ఈ విషయం తెలుసుకుని అక్కడికి పరిగెత్తాడు. ఈ క్రమంలో అక్కడ నిలిపి ఉన్న కారులో నుంచి గుర్తు తెలియని దుండగులు సామ్‌పై కాల్పులకు తెగబడి.. అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో స్థానికులు అతడిని ఆస్పత్రిలో చేర్పించగా.. అప్పటికే సామ్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే నిరసనకారులు మాత్రం ఇది పోలీసుల పనే అని ఆరోపిస్తున్నారు. ఈ విషయం గురించి సామ్ అక్క మౌసుమీ బేగం మాట్లాడుతూ... ‘ నా తమ్ముడు అమాయకపు పిల్లాడు. నిజానికి వాడికి పౌరసత్వ సవరణ చట్టం గురించి పూర్తిగా తెలియదు. సంగీతం అంటే వాడికి ఆసక్తి. డ్రమ్మర్‌గా ఎదగాలనేది వాడి ఆశయం. అందుకే జుబిన్ వస్తున్నాడని తెలియగానే అక్కడికి పరిగెత్తాడు. గుర్తు తెలియని దుండగుల తూటాలకు బలయ్యాడు. ఇది మాకు జీవితకాలపు విషాదం. టూటూ(సామ్ ముద్దుపేరు)కి ఫోన్ చేయగానే డాక్టర్ ఫోన్ ఎత్తి.. సామ్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పాడు. వెంటనే అక్కడికి పరిగెత్తుకువెళ్లాం. కానీ అప్పటికే వాడు చచ్చిపోయాడు’ అంటూ బోరున విలపించింది. ఇక సామ్ తల్లిదండ్రులు సైతం ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా సామ్ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున నిరసనకారులు, లాయర్లు, విద్యార్థి నాయకులు హాజరయ్యారు. సూర్యాస్తమయం తర్వాత అరాచక శక్తులు రెచ్చిపోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ఇక ఈ ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు... లోతుగా విచారణ జరిపి నిందితులను అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. సామ్ మరణంతో అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో నామ్‌గఢ్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కాగా వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు పొరుగు దేశాలైన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుంది. -
ఆ అమరవీరుడికి న్యాయం దక్కదా?
27 సంవత్సరాల కిందట హైదరాబాద్ పాతబస్తీలో ఇస్లామిక్ టెర్రరిస్టులు ఉన్నారన్నా, వారి చేతుల్లో మారణాయుధాలున్నా యన్నా ఆశ్చర్యం కలుగుతుంది. ఆ టెర్రరిస్టులు పాతబస్తీ టోలీచౌకీ బృందావన్ కాలనీలో మకాం వేస్తారని అనుకోగలమా. అక్కడ ఏవో తీవ్రమైన కుట్రలు జరుగుతున్నాయని తెలుసుకోవడం ఇంటెలిజెన్స్ వారి విజయమనే చెప్పుకోవచ్చు. ఏదో విధ్వంస రచన జరుగుతున్నదని తెలియగానే యువ పోలీసు అధికారి, అడిషనల్ ఎస్ పి, సాహసి, జి. కృష్ణ ప్రసాద్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు అమ్మాయిలు తలుపుతెరిచారు. వారిని దాటి ముందుకు అడుగు వేస్తుండగానే ఏకే 56 పేలింది. బుల్లెట్లు దూసుకు వచ్చాయి, ప్రసాద్ వెంట ఉన్న గన్మెన్పైన కూడా బుల్లెట్లు కురుస్తున్నాయి. ఇద్దరూ నేలకొరిగారు. కానీ పడిపోయే దశలో కూడా ప్రసాద్ తన సర్వీసు రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. అవి కొందరిని గాయపరిచాయి. తరువాత జరిగిన పరిణామాలు మరింత ఆశ్చర్యం కలిగిస్తాయి. ప్రసాద్ కాల్పులకు గాయపడిన వారు ఆస్పత్రికి వెళ్లినప్పుడు పోలీసులు పట్టుకోగలిగారు. దాడిలో పాల్గొన్న ఒక టెర్రరిస్టును ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టగలిగారు. మరొక టెర్రరిస్టు ముజీబ్ అహ్మద్‌ను పట్టుకోగలిగారు. నేరం రుజువు చేసి ముజీబ్‌ను జైలుపాలు చేయగలిగారు. ఇవన్నీ చెప్పుకోదగ్గ విజయాలే. కానీ తరువాత సంఘటనలు తీవ్రమైనవి. ముజీబ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అవినీతి పేరుకుపోయిన మన సమాజంలో టెర్రరిస్టులు జైలులో కూడా సకల సౌకర్యాలు పొందుతారు. విశాఖ సెంట్రల్ జైలులో ముజీబ్‌కు జైలు అధికారుల ప్రేమాద రాలు లభించాయని ఆ జైల్లో కొంతకాలం ఉండి విడుదలైన నక్సలైట్ల నాయకుడు నాగార్జున రెడ్డి ఆగస్టు 2004లో ఓ విలేకరుల సమావేశంలో ఆరోపించారు. ముజీబ్‌కు మూడు సెల్ఫోన్లు అందుబాటులో ఉంచారని, ఆ టెర్రరిస్టు వాటితో తమ జేకేఎల్ఎఫ్ సహచరులతో సంప్రదింపులు జరిపేవారని నక్సలైట్ ఖైదీ చెప్పారు. విచిత్రమేమంటే నాగార్జున రెడ్డి విడుదలైన నెలలోనే ముజీబ్ కూడా విడుదలైనాడు. నాగార్జున రెడ్డి ఆరోపణలు నిజంకావని జైలు అధికారులు కొట్టి పారేశారు. తమకు సెల్ ఫోన్లున్నా విశాఖ సెంట్రల్జైల్లో పనిచేయవని, నెట్వర్క్ ఎప్పుడూ ఉండదని వారు చెప్పుకున్నారు. ఒకసారి లంచం రుచి మరిగిన వారికి టెర్రరిస్టుల విధ్వంసం కళ్లకు కనబడదు. డబ్బే కనిపిస్తుంది. వీరి అండదండలతో ముజీబ్ తన కార్యక్రమాలు చేసుకుంటూనే ఉన్నాడనుకోవాలి. భారత స్వాతంత్య్రోత్సవ దినాన టెర్రరిస్టుకు స్వతంత్రం లభించింది. ఎంత స్వతంత్రం అంటే ఎస్కార్టు కల్పించి విశాఖ నుంచి హైదరాబాద్ దాకా తీసుకువచ్చి వాడిని సాగనంపారు. అతను హైదరాబాద్‌లో తన మిత్రులను కలుసుకుని సహచరులతో హాయిగా సంప్రదించి ఉత్తర భారత్ వైపు వెళ్లిపోయి అక్కడ కూడా కొన్ని టెర్రరిస్టు కార్యక్రమాలు జరిపి దొరికిపోయాడని, ఆ తరువాత పోలీసుల అద్భుతమైన కస్టడీ నుంచి తప్పు కుని పారిపోయాడని తెలిసింది. మళ్ళీ దొరకలేదు. జైలునుంచి స్వాతంత్య్ర దినోత్సవ బహుమతి కింద విడుదలైన ఈ టెర్రరిస్టు సాగించిన నేరాలకు ఎవరు బాధ్యులు.అతను ఇంకా నేరాలు చేస్తూ ఉంటే ఆ నేరాలకు ఎవరు బాధ్యులు. టెర్రరిజం ప్లస్ లంచగొండితనం ప్లస్ అసమర్థత, నిర్లక్ష్యం కలిస్తే ఎందరు కృష్ణ ప్రసాద్లైనా నేలకొరుగు తారు. ఎందరు వెంకటేశ్వర్లయినా బుల్లెట్లకు బలవుతారు. ముజీ బ్‌ను విడుదల చేసిన ప్రభుత్వ అధికారులకు శిక్షలు ఉండవు, ఉన్నా పడవు. ఆ టెర్రరిస్టులను ఎంతో ప్రేమతో ఆదరించిన లంచగొండి అధికారులెవరో తెలుసుకునేందుకు విచారణ కూడా జరపరు. ఇవన్నీ ఒక ఎత్తయితే, అమరులైపోయిన కృష్ణ ప్రసాద్ వంటి వీరులను పట్టించుకోరు, గుర్తించరు, సరైన అవార్డులు, పతకాలు ఇవ్వరు. భారత స్వతంత్ర సమరంలో మద్రాస్‌లో బ్రిటిష్ పోలీ సుల తుపాకీలకు ఛాతీ విప్పి ఎదుర్కొన్న టంగు టూరి ప్రకాశంగారిని మనం ఆంధ్ర కేసరి అని గౌర విస్తాం. కానీ ఏకే 56 బుల్లెట్లకు ఎదురొడ్డి ప్రాణాలర్పించిన కృష్ణ ప్రసాద్ వంటి అమరవీరులను ఏవిధంగా గౌరవిస్తున్నాం? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ madabhushi.sridhar@gmail.com -
హోదాకు అహంభావమే అడ్డు
న్యూఢిల్లీ: ప్రాణాలర్పించిన జవాన్లకు అమరవీరుల హోదా ఇవ్వాలన్న తన విజ్ఞప్తిని అమలు చేసేందుకు ప్రధాని మోదీకి అహంభావం అడ్డు వస్తోందని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా కనీసం సుప్రీంకోర్టు ఆదేశాలతోనైనా పారామిలటరీ బలగాలకు మెరుగైన జీతాలు అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సీఆర్పీఎఫ్కు జీతాల పెంపును వ్యతిరేకిస్తూ పుల్వామా ఉగ్రఘాతుకానికి కొన్ని రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు వచ్చిన వార్తను కూడా ఆయన షేర్ చేశారు. గత ఐదేళ్లలో సైనికుల ప్రాణాలను కాపాడటానికి మోదీ తీసుకున్న చర్యలేంటో చెప్పాలని కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ప్రశ్నించారు. ఆక్రమిత అటవీ భూముల నుంచి ఆదివాసీలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసితులను ఖాళీ చేయించాలంటూ ఆయా రాష్ట్రాలకు సుప్రీంకోర్టు జారీచేసిన ఆదేశాలపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని మధ్యప్రదేశ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు రాహుల్ లేఖలు రాశారు. -
వీరమరణం మీదా వివక్షేనా?
కొత్త కోణం ఈ దేశ భూభాగాన్ని రక్షించేందుకు తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వీర జవానుకి అటు ఆరు ఇటు మూడడుగుల జాగా కరువవడాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ దేశంలో వీరుల నెత్తుటికి అంటుకున్న కులం మర్మాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఒక సైనికుడు వీర మరణం పొందితే అటువంటి వారి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో, గౌరవప్రదంగా నిర్వహిస్తారు. కానీ వీర్‌సింగ్ అంత్యక్రియలకు కులం అడ్డొచ్చింది. అందుకే ఎటువంటి ప్రభుత్వ లాంఛనాలూ లేకుండానే ఓ వీరుడి అంత్యక్రియలు జరిగాయి. దేశ రక్షణ కోసం ఉన్న ఊరినీ, కన్నతల్లినీ, సర్వస్వాన్నీ వదిలి కదనరంగానికి ఉరికే యుద్ధవీరులు వాళ్లు. సరిహద్దులను కాపాడేందుకు ప్రాణాలను పణంగా పెట్టే త్యాగధనులు. నిజమైన దేశభక్తులు. ఇది ఈనాడు ప్రతినోటా వినిపిస్తున్న మాట. మనందరం ఒప్పుకోవాల్సిన మాటే. కానీ అంతకు ముందు అదే దేశభక్తికి అంటుకున్న మైల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇటీవల జమ్మూ-కశ్మీర్ లోని పాంపోర్ ప్రాంతంలో జరిగిన మిలిటెంట్ల దాడిలో ఎనిమిది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. వారిలో వీర్ సింగ్ ఒకరు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లా నాగ్లా కేవల్ గ్రామానికి చెందినవాడు. సంప్రదాయం ప్రకారం అంత్యక్రియల కోసం వీర్‌సింగ్ భౌతిక కాయాన్ని నాగ్లా కేవల్‌కు తీసుకొచ్చారు. అంత్యక్రియలను ప్రభుత్వ స్థలంలో నిర్వహించాలనీ, అక్కడే స్మారక స్తూపం నిర్మించాలనీ కుటుంబ సభ్యులు, మిత్రులు భావించి ఏర్పాట్లు ప్రారంభించారు. కానీ ఓ దళితుడికి ప్రభుత్వ భూమిలో, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగడం ఆ గ్రామ అగ్ర కుల పెత్తందార్లకు కంటగింపయింది. ఆ అమర జవాను వీర్‌సింగ్ దహన సంస్కారాలను అడ్డుకున్నారు. గత్యంతరం లేక కుటుంబ సభ్యులు జిల్లా అధికారులను ఆశ్రయించారు. చాలా సేపటికి చేరుకున్న తాలూకా అధికారి అగ్రకులస్తులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. చాలాసేపు ప్రయత్నం చేసిన తర్వాత కేవలం పది గజాల స్థలం ఇవ్వడానికి అంగీకరించారు. ఈ దేశ భూభాగాన్ని రక్షించేందుకు తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వీర జవానుకి అటు ఆరు ఇటు మూడడుగుల జాగా కరువవడాన్ని అర్థం చేసు కోవాలంటే ఈ దేశంలో వీరుల నెత్తుటికి అంటుకున్న కులం మర్మాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఒక సైనికుడు వీర మరణం పొందితే అటువంటి వారి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో, గౌరవప్రదంగా, అట్టహాసంగా నిర్వ హిస్తారు. కానీ వీర్‌సింగ్ అంత్యక్రియలకు కులం అడ్డొచ్చింది. అందుకే ఎటు వంటి ప్రభుత్వ లాంఛనాలూ లేకుండానే ఓ వీరుడి అంత్యక్రియలు జరి గాయి. పూడ్చిపెట్టేందుకు జానెడు జాగాకు సైతం నోచుకోని మరో దళితుడి లిస్టులో వీరజవాను చేరిపోయాడు. వీర్‌సింగ్ కడజాతివాడు కనుకనే అతని త్యాగానికి విలువ లేకుండా పోయింది. ఇక్కడ ఒక్కమాట చెప్పాలని వుంది. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో అంబేడ్కర్ విద్యార్థి సంఘం నాయకుడు వేముల రోహిత్ ఆత్మహత్య చేసుకున్న సందర్భంగా చాలా మంది ప్రజా స్వామికవాదులు, దళిత రచయితలు వ్యాసాల ద్వారా నిరసనను వ్యక్తం చేశారు. కొంతమంది ‘దేశభక్తులు’ ఈ ఘటనపై సానుభూతి తెలుపకపోగా, సరిహద్దుల్లో ఎంతోమంది సైనికులు నిత్యం ప్రాణాలు కోల్పోతున్నారనీ, వారిని గురించి ఈ రచయితలు ఎవ్వరూ ఎందుకు మాట్లాడ్డంలేదనీ వెట కారాలు పోయారు. కొంతమందికి ఇది నిజమే కదా అనిపించి ఉండవచ్చు. అయితే ఆ రోజు మేము కూడా జవాన్లు అందరూ ఒక్కటే కదా అనుకున్నాం. వీర మరణం పొందిన ఎవరి ప్రాణానికైనా అంతే విలువుంటుందనుకున్నాం. కానీ వీర్‌సింగ్ భౌతికకాయానికి జరిగిన అవమానం, వివక్ష చూసిన తర్వాత ‘దేశభక్తి’కి కూడా కులం ఉంటుందని నిరూపితమైంది. ఈ దేశంలో వీర జవాన్ భౌతికకాయానికి జరిగిన అవమానం పత్రికలు, సోషల్ మీడియా ద్వారా వెలుగులోనికి వచ్చింది. కానీ ప్రతి గ్రామంలో దళితుడు మరణిస్తే వారి శవాలను బొందపెట్టే జాగా లేదన్నది కఠోర వాస్తవం. దళితుల శవా లను పూడ్చే శ్మశానాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నిర్వహించిన సర్వే ప్రకారం కొన్ని వందల గ్రామాల్లో దళితుల శవాలకు శ్మశానాల్లో చోటు లేదు. గత ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీలు, గ్రామంలో దళితులకు ప్రత్యేక శ్మశానాలు నిర్మిస్తామని వాగ్దానం చేశాయంటే పరిస్థితి అర్థం అవుతుంది. ఎప్పుడో వందేళ్ల నాటి అంబేడ్కర్ కాదు ఇప్పుడే, ఇక్కడే, మనకళ్ల ముందే ఎందరో అంబేడ్కర్లు ఇంకా అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారనడానికి ఎన్నో ఉదాహరణలు. మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లా, జన్పద్ గ్రామానికి చెందిన మూడవ తరగతి విద్యార్థి వీరన్ అహిర్వార్ తాగే నీటి కోసం పరితపిస్తూ ప్రాణాలు వదిలాడు. మధ్యాహ్న భోజనం ముగించుకొని మంచినీళ్లు తాగడానికి పాఠ శాలలోని చేతిపంపు దగ్గరకి వీరన్ వెళ్లాడు. అయితే దళితుడైన ఈ బాలుడు చేతి పంపు ముట్టుకోవడానికి వీలులేదంటూ అక్కడి ఉపాధ్యాయుడు వెనక్కి పంపారు. ఆ విద్యార్థి దగ్గరలోని మరో చేదబావి దగ్గరకు వెళ్లి తన బాటిల్‌కు తాడు కట్టి బావిలోకి విసిరాడు. నీళ్లు తోడే ప్రయత్నంలో అదుపుతప్పి బావిలో పడడంతో ఆ చిన్నారి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. కుల దుర హంకారం మరో నిండు నూరేళ్ల జీవితాన్ని ఆదిలోనే తుంచేసింది. వీరన్ కుటుంబ సభ్యులు ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు ఎస్సీ విద్యార్థులను ఇదేవిధంగా వివక్షకు గురిచేస్తున్నారని మృతిచెందిన విద్యార్థి సోదరుడు అధికారులకు తెలిపారు. కలెక్టర్ మాత్రం ఆ గ్రామానికి నీటి ఎద్దడి ఉన్నదని, అందరూ కూడా బావిలో నీటికి వెళుతున్నారని, ఆ సందర్భంగా ప్రమాదం జరిగిందని సర్దిచెప్పి, నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఈ సంఘటనకు బాధ్యుణ్ణి చేస్తూ ఆ గ్రామాధికారిని సస్పెండ్ చేశారు. ఆ గ్రామమేంటి, వందల గ్రామాల్లో దళితులు ఇతరుల బావుల్లో నీటిని చేదుకునే అర్హతకు ఇంకా నోచుకోలేదు. సరిగ్గా వందేళ్ల క్రితం అంబేడ్కర్‌కు కూడా ఇటువంటి అనుభవమే ఎదురైంది. తాను పాఠశాల నుంచి తిరిగి వస్తూ, ఒక ఇంటిదగ్గర ఆగి మంచినీరు అడిగిన అంబేడ్కర్‌ను, ఆయన కులం తెలుసుకొని బురద గుంటలోని నీళ్లు తాగమని ఒక తల్లి చీదరించుకొన్న గాథను చదువుకున్నాం. దేశం కోసం ప్రాణాలర్పించిన ఒక జవాన్ వీరమరణాన్నీ వదలని వివక్ష, అవమానం ఒకవైపు; గుక్కెడు నీళ్లకోసం ప్రాణాలు వదల వలసివచ్చిన బాలుడి విషాదం మరోవైపు, దేవుడి ఉత్సవాల కోసం అడ్డుకున్న కుల దుర హంకారం ఇంకోవైపు అడుగడుగునా దళితులను అభద్రతకు, అవమానానికీ గురిచేస్తున్నాయి. దీనికి పరిష్కారం ఏమిటనేది సమాధానం లేని ప్రశ్న. ఇందుకు గాను ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. జరుగుతున్నాయి. కులం, మతం పట్టింపులేని వాళ్లు చాలా మాట్లాడవచ్చు. కానీ ఫలితం పరిమితం. వివక్షకు వ్యతిరేకంగా సాగిన, సాగుతున్న ఉద్యమాలు ఆధిపత్య శక్తులపై ప్రభావం కలుగజేస్తున్నాయి. శాశ్వత పరిష్కారం లభించటం లేదు. పైగా ఇవి పునరావృతం అవుతున్నాయి. మూడేళ్ల క్రితం ఆరెస్సెస్ అధినేత మోహన్ భాగవత్ విజయదశమి రోజున నాగపూర్‌లో చేసిన ప్రసంగంలో శ్మశానం, నీరు, దేవాలయాల్లో అందరికీ హక్కు ఉండాలని ప్రకటించారు. కానీ గ్రామాల్లో ఆ మూడు వివక్షలే కాదు, ఇంకా ఎన్నో వివ క్షలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటి నిర్మూలనకు చిత్తశుద్ధితో ప్రయత్నం జరగాలి. ఆరెస్సెస్ లాంటి సంస్థల్లోని సభ్యులే ఇప్పుడు భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. కులవివక్ష, అంటరానితనం నిర్మూల నకు అమల్లో ఉన్న చట్టాలు సరిగ్గా అమలు జరుగుతున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలో కొన్ని ముఖ్యమైన మార్పులు తీసుకురావడానికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ఆమో దించారు. దానికి అనుకున్నంత సానుకూలత లభించలేదు. ఒకవైపు ప్రభు త్వాలు అంటీముట్టనట్టుంటే, మరోవైపు కొన్ని హిందూ ధార్మిక సంస్థలు, కొందరు స్వాములు హిందూ ధర్మాన్ని రక్షించడానికి చట్టాలు చేయాలం టున్నారు. ఇటీవల అటువంటి బృందం ఒకటి కొందరు కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసింది. వాళ్లు కోరుకుంటున్న సంస్కరణలు ఏమిటనేది తరచి చూడాలి. వేల సంవత్సరాల చరిత్రను బట్టి చూస్తే, హిందూమతానికి బయటి వ్యక్తుల నుంచి కంటే, హిందూత్వ శక్తులు, కులవాదుల నుంచే ప్రమాదం ఎక్కువ. హిందూ మతం నిజంగా ఒక ధార్మిక శక్తిగా నిలబడాలంటే అందులో సమూల మార్పులు జరగాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ తన ‘కుల నిర్మూలన’ పుస్తకంలో స్పష్టమైన కార్యక్రమం ప్రకటించారు. ‘హిందూ మతం మనుగడ సాగించాలంటే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఒక నూతన నియమావళిని ప్రకటించాలి. అందులో అందరికీ సమానమైన అవకాశాలు, హక్కులు ఉండాలి. ముఖ్యంగా ఇతర మతాల లాగా, ఏదో ఒక కులం మాత్రమే పూజారులుగా ఉండే విధానం పోవాలి. మతాన్ని గౌరవించి, దానిని అనుసరించి, ధార్మిక విధానాన్ని అర్థం చేసుకొన్నవారెవరైనా, దానికి సంబంధించిన పూజా విధానాన్ని ఆమూలాగ్రం తెలిసిన వారెవ్వరైనా పూజారులుగా ఉండే విధానం రావాలి. అప్పుడు మాత్రమే హిందూమతంలో అంతస్తుల వ్యవస్థకు ముగింపు పలకగలం. అంతేకాకుండా కొన్ని కులాలను తరతరాలుగా ఇంకా తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడం, పశువులకన్నా హీనంగా చూసే విధానానికి స్వస్తి పలకాలి.’ కుల వివక్ష, అత్యాచారాల వల్ల అంటరాని కులాలు బానిసత్వం నుంచి విముక్తికి పరాయి పాలకుల సహకారం తీసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా సైనిక యుద్ధతంత్రంలో ఆరితేరిన అంటరాని కులాలు ఇప్పటికే ఈ దేశానికి ఒక హెచ్చరిక చేశాయి. మహారాష్ట్రలోని పీష్వాల పాలనను అంతం చేసింది అక్షరాలా మహర్ సైన్యమేననేది గుర్తు చేసుకోవాలి. దళితుల నేపథ్యాన్ని, త్యాగనిరతిని విస్మరించే తీరులో వీర్సింగ్కు జరిగిన అవమానాలే పున రావృతమైతే భారత సైన్యంలోని ప్రతి దళితుడికీ అవమానం జరిగినట్టే. దళితుల త్యాగాలకు వెలకట్టమని మేం అడగడం లేదు. కానీ ఓ దళితుడు ఈ దేశం కోసం చేసిన త్యాగాన్ని మరచిపోతే మన పునాదులు మిగలవు. చివరకు దళితుల శవాలను కూడా కులతత్వం పీడిస్తుంటే మరో దళితుడు ఈ దేశం కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడడు. తరతరాల వివక్ష క్షోభను మర్చి పోయి సమాజంలో భాగంకాలేడు. ఏ మాత్ర ం చిత్తశుద్ధి ఉన్నా ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణమంత్రి పరీకర్ యావత్ దేశానికి, దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలి. మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 97055 66213 -
తెలంగాణ అమరవీరుడి తల్లి ఆత్మహత్యాయత్నం
తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తి మాతృమూర్తి అధికారుల తీరుతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేసింది. గురువారం ఖమ్మం పట్టణంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్ వద్ద జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన రావు సుధాకర్‌రెడ్డి తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ఖమ్మం జిల్లా ముదిగొండలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడ్ని అమరవీరుడిగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించడంతోపాటు, అతడి భార్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలైనప్పటికీ రూ.10 లక్షల పరిహారాన్ని అందజేసింది. కాగా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో సుధాకర్‌రెడ్డి తల్లి సుగుణమ్మ తన చిన్న కుమారుడు సురేందర్‌రెడ్డికి ఉద్యోగం ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో గురువారం రాష్ట్రావతణ వేడుకల నేపథ్యంలో ఖమ్మం పట్టణంలోని పోలీసు పరేడు గ్రౌండ్స్ వద్దకు చేరుకుంది. అధికారులను కలసి తన చిన్న కుమారుడికి ఉద్యోగం విషయమై వాకబు చేసింది. జాబితాలో పేరు లేదని వారు చెప్పడంతో అధికారులు పట్టించుకోలేదంటూ మనస్తాపం చెందిన అక్కడే చెట్టు కింద కూర్చుని పరుగుల మందు సేవించింది. ఆమెను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి... మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. -
'మంచం కింద దాక్కున్నాం'
గురుదాస్ పూర్: 'ఆయన కూతురిగా పుట్టినందుకు నేను చాలా చాలా గర్వపడుతున్నా' అని అమరజవాను ఫతే సింగ్ కుమార్తె మధు అన్నారు. శనివారం పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లోకి చొరబడ్డ ఉగ్రవాదులతో పోరాడుతూ సుబేదార్ మేజర్ ఫతే సింగ్ ప్రాణాలు కోల్పోయారు. ముష్కరులు చొరబడ్డారనే సమాచారం తెలియగానే యూనిఫాం ధరించి తన తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోయారని ఆమె తెలిపింది. 1995 కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ ఈవెంట్ లో స్వర్ణ, రజత పతకాలు గెలిచిన ఫతే సింగ్ తాను చనిపోయే ముందు ఉగ్రవాదుల్లో ఒకడి తుపాకీ లాక్కుని అతడిని మట్టుబెట్టారు. తన తండ్రి ఉగ్రవాదులతో పోరాడానికి వెళ్లిపోగానే ఇంట్లో తాము బిక్కుబిక్కుమంటూ గడిపామని టీచర్ గా పనిచేస్తున్న 25 ఏళ్ల మధు చెప్పింది. 'కాల్పుల మోత విన్పిస్తోంది. తుపాకీ బుల్లెట్లు మా ఇంటి కిటికీ దగ్గర పడుతున్నాయి. మేము రెండు గంటల పాటు మంచం కింద దాక్కున్నాం. కింద చాలా చలిగా ఉంది. కానీ మంచంపై పడుకుని మా ప్రాణాలను బలిపెట్టే సాహసం చేయలేకపోయాం. మమ్మల్ని ఉగ్రవాదులు గుర్తిస్తారనే భయంతో ఇంట్లో లైట్లు అన్నీ ఆర్పేశాం. చిమ్మచీకటిలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడిపాం' అని మధు చెప్పింది. సత్యం కోసం గళం విప్పాలి, పోరాడాలని అని తన తండ్రి చెప్పేవారని గుర్తు చేసుకుంది. చెడును ఓడించడానికి మంచికి మనవంతు సాయం చేయాలని అనేవారని, ఆ విలువలను ఆయన తుదివరకు పాటించారని వెల్లడించింది. పఠాన్ కోఠ్ ఎయిర్ బేస్ లో చొరబడిన ఉగ్రవాదులతో ఫతే సింగ్ సహా ఏడుగురు సైనికులు వీరమరణం పొందారు. 20 మంది గాయపడ్డారు. ఐదుగురు ఉగ్రవాదులను సైనికులు హతమార్చారు. మరో ఇద్దరు ముష్కరులు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. -
ఆ జర్నలిస్టు కోసం వేట
ముంబై: ఐఎస్ఐఎస్లో చేరాలనుకుంటున్నట్లు వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు జుబర్ అహ్మద్ ఖాన్ కోసం ముంబై పోలీసులు వేట మొదలు పెట్టారు. దేశ ప్రతిష్టకు భంగం వాటిల్లేలా, రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసిన అతడిని ఎలాగైనా పట్టుకుని తీరాలని పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జుబర్ అహ్మద్ ఖాన్ కు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ముంబై పేలుళ్ల కేసు దోషి యాకూబ్ మెమన్ ఉరికి సానుభూతిని వ్యక్తం చేస్తూ జుబర్ అహ్మద్ ఖాన్ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు పోస్టు చేశాడు. అంతేకాకుండా తాను ఐఎస్ ఉగ్రవాద సంస్థకు ప్రతినిధిగా వ్యవహరించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు. యాకూబ్ మెమన్ మృత వీరుడుగా అభివర్ణించాడు. దీనిపై ఓ వ్యక్తి పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. దేశంలో ఉగ్రవాదుల దాడులు, పాకిస్తాన్ ఉగ్రవాదుల చొరబాటు వార్తల నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ముంబై పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కాగా ఆ జర్నలిస్టు నవీ ముంబైలో నివసిస్తున్నట్టుగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా తృటిలో తప్పించుకున్నట్టు సమాచారం.