ఇంఫాల్: మణిపూర్ అల్లర్లలో బీఎస్‌ఎఫ్ జవాన్లు అల్లరి మూకలతో వీరోచితంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో సైన్యంలో పనిచేసి అమరుడైన సైనికుని కుటుంబాన్ని ఆందోళనకారుల నుంచి రక్షించారు. అమరవీరుని కుటుంబం నివసిస్తున్న మఫౌ గ్రామం ఆపదలో ఉందని గమనించి అక్కడకు చేరుకున్నారు. దేశానికి కాపాలా కాసిన అమరుని ఇంటికి జవాన్లు ప్రస్తుతం రక్షణ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలోని పిల్లలు, వృద్ధులు, స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు.
మణిపుర్‌లోని మఫౌ గ్రామానికి చెందిన పాయోటిన్సాట్ గైట్ బీఎస్‌ఎఫ్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. 2020 డిసెంబరు 1న కశ్మీర్‌లోని ఎల్‌వోసీ వద్ద చొరబడేందుకు ప్రయత్నించిన ముష్కరులను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడుతూ గైట్ అమరుడయ్యాడు. ఆయన తెగువకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం గైట్ స్వగ్రామం ఆపదలో ఉందని గుర్తించి బీఎస్‌ఎఫ్ జవాన్లు .. అల్లరి మూకలను పారదోలారు. ఆ గ్రామాన్ని రక్షించారు.
ఇదీ చదవండి: రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడలకు షాక్.. ప్రసంగానికి డిప్యూటీ ఛైర్మన్ బ్రేక్
సురక్షిత ప్రాంతంలో ఉన్న గైట్ తండ్రి టోంగ్‌జాంగ్ గైట్.. బీఎస్‌ఎఫ్ జవాన్లు తమను, తమ గ్రామాన్ని కాపాడిన తీరును వివరించారు. ' దాదాపు 1000 మంది అల్లరిమూకలు మా గ్రామంపై దాడి చేశారు. దీనిని పసిగట్టిన మేము గ్రామంలో పిల్లలు, స్త్రీలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు అప్పటికే తరలించాము. దాడిని పసిగట్టిన బీఎస్‌ఎఫ్ జవాన్లు.. మా గ్రామానికి అండగా నిలబడ్డారు. కానీ అప్పటికే 50 శాతం ఇళ్లు కాలిబూడిదయ్యాయి.' అని తెలిపారు.
'అమరవీరుని కుటుంబం అయినందున రెండేళ్ల క్రితం మణిపూర్ సీఎం మమ్మల్ని ఇంటికి పిలిచి గౌరవించారు. రూ.5 లక్షల ఆర్థిక సహాయం కూడా చేశారు. కానీ మేము ఇప్పుడు ఈ దాడిలో బాధితులుగా మిగిలిపోయాము. మా ఇంటిని విడిచి వేరే ప్రాంతాల్లో ఉండాల్సి వస్తోంది.' అంటూ టోంగ్‌జాంగ్ గైట్ కన్నీటి పర్యంతమయ్యారు.
తమ కోడలు హోనిల్‌హింగ్ గైట్ కూతుళ్ల చదువుల కోసం మేఘాలయాలో ఉన్నట్లు చెప్పాడు. తనకు ఇద్దరు 6, 3 ఏళ్ల వయస్సు కలిగిన మనవరాళ్లు ఉన్నట్లు చెప్పారు. మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. తమ కోడలు, మనవరాళ్లతో ఇక్కడే ఉండాలని ఉందని తెలిపారు.
ఇదీ చదవండి: ఒకపక్క మణిపూర్ అల్లకల్లోలంగా ఉంటే.. 718 మంది వలస వచ్చారు.. కారణం ఏమై ఉంటుంది?
Comments
Please login to add a commentAdd a comment