protected
-
మణిపూర్ అల్లర్లు.. అమరుని కుటుంబాన్ని రక్షించిన బీఎస్ఎఫ్..
ఇంఫాల్: మణిపూర్ అల్లర్లలో బీఎస్ఎఫ్ జవాన్లు అల్లరి మూకలతో వీరోచితంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో సైన్యంలో పనిచేసి అమరుడైన సైనికుని కుటుంబాన్ని ఆందోళనకారుల నుంచి రక్షించారు. అమరవీరుని కుటుంబం నివసిస్తున్న మఫౌ గ్రామం ఆపదలో ఉందని గమనించి అక్కడకు చేరుకున్నారు. దేశానికి కాపాలా కాసిన అమరుని ఇంటికి జవాన్లు ప్రస్తుతం రక్షణ కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ గ్రామంలోని పిల్లలు, వృద్ధులు, స్త్రీలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. మణిపుర్‌లోని మఫౌ గ్రామానికి చెందిన పాయోటిన్సాట్ గైట్ బీఎస్ఎఫ్లో సబ్-ఇన్స్పెక్టర్గా పనిచేశారు. 2020 డిసెంబరు 1న కశ్మీర్‌లోని ఎల్వోసీ వద్ద చొరబడేందుకు ప్రయత్నించిన ముష్కరులను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడుతూ గైట్ అమరుడయ్యాడు. ఆయన తెగువకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం కీర్తిచక్ర పురస్కారంతో సత్కరించింది. ప్రస్తుతం గైట్ స్వగ్రామం ఆపదలో ఉందని గుర్తించి బీఎస్ఎఫ్ జవాన్లు .. అల్లరి మూకలను పారదోలారు. ఆ గ్రామాన్ని రక్షించారు. ఇదీ చదవండి: రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడలకు షాక్.. ప్రసంగానికి డిప్యూటీ ఛైర్మన్ బ్రేక్ సురక్షిత ప్రాంతంలో ఉన్న గైట్ తండ్రి టోంగ్జాంగ్ గైట్.. బీఎస్ఎఫ్ జవాన్లు తమను, తమ గ్రామాన్ని కాపాడిన తీరును వివరించారు. ' దాదాపు 1000 మంది అల్లరిమూకలు మా గ్రామంపై దాడి చేశారు. దీనిని పసిగట్టిన మేము గ్రామంలో పిల్లలు, స్త్రీలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు అప్పటికే తరలించాము. దాడిని పసిగట్టిన బీఎస్ఎఫ్ జవాన్లు.. మా గ్రామానికి అండగా నిలబడ్డారు. కానీ అప్పటికే 50 శాతం ఇళ్లు కాలిబూడిదయ్యాయి.' అని తెలిపారు. 'అమరవీరుని కుటుంబం అయినందున రెండేళ్ల క్రితం మణిపూర్ సీఎం మమ్మల్ని ఇంటికి పిలిచి గౌరవించారు. రూ.5 లక్షల ఆర్థిక సహాయం కూడా చేశారు. కానీ మేము ఇప్పుడు ఈ దాడిలో బాధితులుగా మిగిలిపోయాము. మా ఇంటిని విడిచి వేరే ప్రాంతాల్లో ఉండాల్సి వస్తోంది.' అంటూ టోంగ్జాంగ్ గైట్ కన్నీటి పర్యంతమయ్యారు. తమ కోడలు హోనిల్హింగ్ గైట్ కూతుళ్ల చదువుల కోసం మేఘాలయాలో ఉన్నట్లు చెప్పాడు. తనకు ఇద్దరు 6, 3 ఏళ్ల వయస్సు కలిగిన మనవరాళ్లు ఉన్నట్లు చెప్పారు. మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. తమ కోడలు, మనవరాళ్లతో ఇక్కడే ఉండాలని ఉందని తెలిపారు. ఇదీ చదవండి: ఒకపక్క మణిపూర్ అల్లకల్లోలంగా ఉంటే.. 718 మంది వలస వచ్చారు.. కారణం ఏమై ఉంటుంది? -
కరోనాపై ‘కంటికి కనిపించని యుద్ధం’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ కష్ట సమయంలో త్రివిధ దళాలను, వ్యూహాత్మక సంపత్తిని కాపాడుకునేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దేశంలో కరోనా మహమ్మారిపై పోరాటంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న భద్రతా బలగాలు.. మరో వైపు సరిహద్దుల రక్షణ విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదని తెలిపారు. ఆదివారం ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. కరోనాపై పోరాటాన్ని దేశం చేస్తున్న ‘అతిపెద్ద అదృశ్య యుద్ధం’గా ఆయన అభివర్ణించారు. ‘కోవిడ్–19పై సాగిస్తున్న పోరు అతిపెద్ద అదృశ్య యుద్ధం. మానవత్వంపై జరుగుతున్న యుద్ధం. దేశ ఆర్థిక భద్రత, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే యుద్ధం’అని ఆయన అన్నారు. ఉగ్ర శిబిరాలపై దాడులు యథాతథం జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా సైన్యం దాడులు కొనసాగుతాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. పాక్ చొరబాటుదారులు సరిహద్దులు దాటి దేశంలోకి రాకముందే వారిని సైన్యం అడ్డుకుంటుందని తెలిపారు. కోవిడ్–19 నుంచి కాపాడుకునే విషయంలో ప్రధానమంత్రి కార్యాలయం, ఆరోగ్య శాఖ, వైద్య సంస్థల సూచనలను త్రివిధ దళాలు పాటిస్తున్నాయన్నారు. నేవీ సిబ్బందికి కరోనా సోకిందన్న వార్తలు, కరోనా ప్రభావం సైనిక బలగాలపై పడుతుందన్న అనుమానాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
పశువుల్లో బాక్టీరియా వ్యాధులు
శీతాకాలంలో పశువులను వ్యాధుల బారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గొంతువాపు: పాస్టురెల్లా మల్టోసైడా అనే బ్యాక్టీరియా వల్ల గొంతువాపు వస్తుంది. ఒక్కసారిగా జ్వరం రావడం, నోటి చొంగ, ఊపిరి కష్టంగా ఉండటం లాంటివి చూపిస్తుంది. 24 గంటల్లో పశువు చనిపోతుంది. చలికాలంలో పశువులు దగ్గర దగ్గరగా ఉంటుంటాయి. అందువల్ల చొంగ ద్వారా ఈ వ్యాధి త్వరగా వ్యాపించవచ్చు. ఇంతకుముందే టీకాలు వేయించుకొని ఉంటే గొంతువ్యాపు రాదు. ఇప్పుడు కూడా టీకా వేయించుకోవచ్చు. వైద్యము ఖరీదు కాబట్టి నివారణ మేలు. పింక్ ఐ: ఇన్ఫెచ్యువస్ బొవైన్ కెరెటో కంజెక్టువైటిస్ అనే వ్యాధికి పింక్ ఐ అని కూడా పేరు. దీని తీవ్రత వర్షాకాలంలో ఎక్కువైనప్పటికీ శీతాకాలంలోనూ వ్యాపిస్తుంది. మోరాక్సెల్లా బోవిస్ అనే బ్యాక్టీరియా వల్ల పింక్ ఐ సోకుతుంది. వ్యాధి బారిన పడి తేరుకున్న పశువుల ముక్కు రంధ్రాల ద్వారా ఈ బాక్టీరియా బయటకు వ్యాప్తి చెందుతుంది. త్వరగా వైద్యం మొదలు పెట్టడం, పశువైద్యుని సలహా మేరకు టెట్రాసైక్లిన్స్ గల ఆంటీబయోటిక్స్ని వాడాలి. ఫుట్ రాట్: దీనినే గొర్రెల్లో వాడుక భాషలో కుంట్లు అంటారు. గిట్టల మధ్య వాచి, నొప్పిగా ఉండి, పశువులు కుంటుతూ ఉంటాయి. ఫ్యూసోబ్యాక్టీరియమ్ నెక్రోఫోగమ్ అనే బ్యాక్టీరియా వలన కలుగుతుంది. చిత్తడి నేలల్లో పశువులను ఉంచినట్లయితే ఈ పరిస్థితి వస్తుంది. కాళ్ల మీద బరువు మోపలేకపోవడం, నొప్పి కనబరచడం, వాసన కలిగి ఉండడం, మేత మేయలేకపోవడం లాంటి లక్షణాలను పశువు చూపిస్తుంది. పశువులను పొడి నేలల్లో ఉండడం, పెన్సిలిన్, సెప్టియోఫర్, టెట్రాసైక్లిన్ లాంటి యాంటీ బయోటిక్స్‌ను వాడాలి. కాఫ్ దిప్తీరియా/లారిన్జైటిస్: ఇది కూడా ఫూసోబ్యాక్టీరియమ్ నెక్రోఫోరమ్ వల్లనే కలుగుతుంది. 3 నుంచి 18 నెలల వయసున్న దూడల్లో ఎక్కువగా కనబడుతుంది. జ్వరం, దగ్గు, రొప్పడం వంటి లక్షణాలు కనబడతాయి. పక్కపక్కనే ఉన్న పశువులకు సోకుతుంది. పశువైద్యుని సలహా మేరకు యాంటిబయోటిక్స్‌ను వాడాలి. కంటేజియస్ బొవైన్ ఫ్లూగో నిమోనియా: చలికాలంలో పశువుల ఊపిరితిత్తులు వాచి, 107 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు జ్వరం రావడం, కళ్ల వెంబడి పుసులు రావడం, పశువు బాగా చిక్కిపోవడం, కష్టసాధ్యమైన ఊపిరి.. ఇవీ లక్షణాలు. పశువు 1–3 వారాల్లో చనిపోయే ప్రమాదం ఉంది. ఖచ్చితమైన పరిశుభ్రత పాటించాలి. టైలోసిస్ లాంటి యాంటిబయోటిక్స్ కొంత ఉపయోగకరం. – డా. ఎం.వి.ఎ.యన్. సూర్యనారాయణ (99485 90506), ప్రొఫెసర్ – అధిపతి, డిపార్ట్మెంట్ ఆఫ్ లైవ్‌స్టాక్ ఫామ్ కాంప్లెక్స్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, తిరుపతి -
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
-
వేరుశనగ పంటను కాపాడాలి
అనంతపురం అర్బన్: ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగపంట ఎండిపోకుండా రెయిన్గన్ల ద్వారా రక్షక నీటి తడులను అందించాలని వ్యవసాయశాఖ అధికారులను ఇన్చార్జి కలెక్టర్ లక్ష్మీకాంతం, వ్యవసాయశాఖ డైరెక్టర్ ధనుంజయరెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ నుంచి వ్యవసాయ అధికారులు, ఎంపీడీఓలు, ఏపీఎంఐపీ కంపెనీల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 12,387 హెక్టాలర్లలో వెరుశనగర పంట బెట్ట పరిస్థితుల్లో ఉందన్నారు. ఇప్పటి వరకు 6,446 హెక్టార్లలో రెయిన్ గన్ల ద్వరా రక్షక తడి అందించారని, కొన్ని చోట్ల ఎంపీఈఓలు, ఏఓలు సక్రమంగా స్పందించడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నిర్లక్ష్యం వీడి చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు. ఎక్కడైనా పంట ఎండితే మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. జీడిపల్లి రిజ్వాయర్‌లో 1.2 టీఎంసీల నీరుందని, హెచ్ఎన్ఎస్ఎస్ నీటిని, ఎక్కడైనా చెరువుల్లో ఉన్న నీటిని వినియోగించుకుని రెయిన్గన్ల ద్వారా పంటకు అందించాలని ఆదేశించారు. ఐదుగురు ఎంపీడీఓలకు అవార్డులు జిల్లాలో ఇప్పటి వరకు 52 గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా మార్చారని, అక్టోబరు 2 నాటికి 150 గ్రామాలను ఈ విధంగా తీర్చిదిద్దాలని అధికారులను జేసీ లక్ష్మీకాంతం ఆదేశించారు. సోమవారం ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, ప్రజాసాధికార సర్వేపై సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాన్ని వందశాతం పూర్తయ్యేలా చేసిన పుట్టపర్తి, కొత్తచెరువు, సోమందేపల్లి, పెద్దపప్పూరు, పుట్టూరు ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లకు ఈ నెల 26న అవార్డులను ప్రదానం చేస్తున్నామన్నారు. తాడిపత్రిలోనూ వంద శాతం ఓడీఎస్ చేసినందున మునిసిపల్ కమిషనర్‌కి కూడా అవార్డు ప్రకటించామన్నారు. -
చైల్డ్‌లైన్ చెంతకు చేరిన ఐదేళ్ల బాలిక
ఒంగోలు క్రైం: ఒంగోలు నగరంలోని దేవుడు చెరువులో శుక్రవారం ఒంటరిగా తిరుగుతున్న ఐదేళ్ళ బాలిక లక్ష్మి చైల్డ్‌లైన్ చెంతకు చేరింది. దేవుడు చెరువులో ఒంటరిగా తిరుగుతూ ఏడుస్తున్న లక్ష్మిని స్థానికులు గమనించి ఆ పాప తల్లి, దండ్రులు, ఇతర వివరాల కోసం ఆరా తీశారు. ఎంతకీ చెప్పలేక పోవటంతో స్థానికులు ఒంగోలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. వన్‌టౌన్ పోలీసులు చైల్డ్‌లైన్ ప్రతినిధి బి.వి.సాగర్‌కు సమాచారాన్ని అందించారు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సాగర్ పాప వివరాలు రాబట్టేందుకు ప్రయత్నించారు. అయితే తనపేరు లక్ష్మి అని, తండ్రి బ్రహ్యయ్య, తల్లి మల్లేశ్వరి అని మాత్రమే చెబుతోంది. అంతకు మించిన వివరాలు ఏమీ చెప్పలేక పోతోందని బివి.సాగర్ వివరించారు. వెంటనే పాపను జిల్లా బాలల సంక్షేమ కమిటీ ఎదుట హాజరు పరిచారు. వారి ఆదేశాల మేరకు ఒంగోలులోని శిశుగృహలో చేర్పించారు. అప్పటి నుంచి పాప రోధిస్తూనే ఉంది. పాప ఆచూకి తెలిసిన వారు వెంటనే చైల్డ్‌లైన్-1098 నంబరుకు ఫోన్ చేసి వివరాలు అందించాలని పేర్కొన్నారు. -
చెన్నైలో తెలుగువారిని రక్షించిన ఎయిర్‌ఫోర్స్
చెన్నై: భారీ వర్షాలతో చెన్నై వాసులు తీవ్ర అవస్తలు పడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న వారికి భారత వైమానిక దళం సహాయం అందిస్తోంది. ఇప్పటికే వర్షాలతో తమిళనాడులో 250 మందికి పైగా మృత్యువాత పడినట్లు సమాచారం. గురువారం వరదల్లో చిక్కుకున్న 200 మంది తెలుగువారిని ఎయిర్ ఫోర్స్ రక్షించి బేగంపేట విమానాశ్రయానికి చేర్చారు. చెన్నైలోని తెలుగువారికి సహాయం అందిస్తామని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. -
సంస్కృతి సంప్రదాయాలు కాపాడాలి
సంక్రాంతి సంబరాలలో ఆర్డీఓ వినాయకం చాపాడు: సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జమ్మలమడుగు ఆర్డీఓ వినాయకం పేర్కొన్నారు. చాపాడు సమీపంలోని శ్రీచైతన్యభారతీ, విజ్ఞాన భారతీ ఇంజనీరింగ్ కళాశాలలు సంయుక్తంగా ఆదివారం సంక్రాంతి సంబరాలను జరిపారు. ఈ సంబరాలకు హాజరైన ఆర్డీఓ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల్లో వాస్తవికత ఉంటుంద న్నారు. వీరి వల్లనే ఇంకా సంస్కృతి, సంప్రదాయాలు బతికి ఉన్నాయన్నారు. అనంతరం పలువురు వక్తలు సంక్రాంతి సంబరాల విశిష్టతపై ప్రసంగించారు. సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన పలు రకాల క్రీడా పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంటు వి.జయచంద్రారెడ్డి, రూరల్ సీఐ పురుషోత్తమరాజు, ఎస్ఐ గిరిబాబు, ప్రొద్దుటూరు వైవీయూ ప్రిన్సిపాల్ జయరామిరెడ్డి, సీబీఐటీ, వీబీఐటీ ప్రిన్సిపాళ్లు డాక్టర్ పాండురంగన్వ్రి, డాక్టర్ శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి కళ: మూడు రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చిందా అనే విధంగా చాపాడు సమీపంలోని సీబీఐటీ-వీబీఐటీ ఇంజనీరింగ్ కాలేజీలలో ఆది వారం గ్రామీణ సంప్రదాయం ఉట్టిపడేలా కళ్లకు కట్టినట్లుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. రైతులుగా.. అల్లరి చే సే కొంటెవాళ్లుగా.. సంప్రదాయ వస్త్రాలతో అచ్చతెలుగు ఆడపడుచుల్లా.. హరిదాసుల్లా.. ఇలా వివిధ వేషధారణలతో విద్యార్థులు అందరినీ ఆకట్టుకున్నారు.