పాక్ జీవనాడిపై దెబ్బ కొడదామా.. వద్దా? | PM Modi holds meeting on Indus Waters Treaty With top officials | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 26 2016 7:29 PM | Last Updated on Wed, Mar 20 2024 3:13 PM

అస్థిర ప్రభుత్వాలు, ఉగ్రవాదం, అవినీతి యంత్రాంగం.. ఒక దేశానికి ఎన్ని అవలక్షణాలుండాలో అంతకుమించే ఉన్న పాకిస్థాన్ ఆర్థిక శక్తిగా కొనసాగుతుండటానికి ప్రధాన కారణం.. సింధూ నదీ జలాలు. పాక్ జీవనాడి అయిన ఈ నదీ జలాలపై 56 ఏళ్ల కిందట చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని లేదా పునఃసమీక్షించుకోవాని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం 'సింధు నదీ జలాల ఒప్పందం'పై పలువురు ఉన్నతస్థాయి అధికారులతో చర్చించారు. భేటీ అనంతరం జలవనరుల శాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాలు త్వరలోనే అందరికీ వెల్లడిస్తామని వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement