Indus Waters Treaty
-
ప్రతిచర్యకు సిద్ధమైన పాక్.. సిమ్లా ట్రీటీకి టాటా?
న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు ఊచకోత కోసిన దరిమిలా సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిచర్యగా చారిత్రక సిమ్లా ఒప్పందం(Shimla Agreement) నుంచి వైదొలిగే అంశం ప్రస్తుతం పాకిస్థాన్ పరిశీలనలో ఉంది. 1971లో భారత్-పాక్ యుద్ధం అనంతరం 1972 జులై 2న ఇరు దేశాల మధ్య సిమ్లా ఒప్పందం (సిమ్లా అగ్రిమెంట్/సిమ్లా ట్రీటీ) కుదిరింది. నియంత్రణ రేఖను ఏకపక్షంగా మార్చకుండా... సమస్యాత్మక అంశాల్ని ఉభయ దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలనేది ఆ సంధి సారాంశం. నాటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ(Indira Gandhi), పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. సమస్యల పరిష్కారంలో రెండు దేశాల మధ్య మూడో దేశం లేదంటే అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవడానికి వీలు లేకుండా సిమ్లా ఒప్పందం ఇండియాకు ఇన్నాళ్లూ ఓ కవచంలా ఉపయోగపడింది. ఇప్పుడు ఈ ఒప్పందానికి కట్టుబడకుండా పాక్ తప్పుకుంటే.. కశ్మీర్ సహా ఇతర వివాదాంశాల పరిష్కారంలో తృతీయ పక్షం జోక్యానికి తలుపులు తెరచినట్టవుతుంది. 1999 అనంతరం ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరగకుండా నిరోధించిన ద్వైపాక్షిక యంత్రాంగం కుప్పకూలినట్టవుతుంది. వ్యవసాయం, ఇంధన అవసరాల కోసం సీమాంతర నదులపై ఆధారపడిన రెండు దేశాలు ప్రాంతీయ నీటి లభ్యత విషయంలో అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ సిమ్లా ఒప్పందం నుంచి ‘స్వీయ ఉపసంహరణ’ మార్గాన్ని పాక్ ఎంచుకునే పక్షంలో ఆ చర్య ఆ దేశానికే నష్టం కలిగిస్తుందని నిపుణుల అభిప్రాయం. ఎందుకంటే అప్పుడిక ద్వైపాక్షిక ఒప్పందం అమల్లో ఉండదు కనుక ఏదైనా చర్చల ప్రతిపాదన వచ్చినా భారత్ తోసిపుచ్చవచ్చు.:::జమ్ముల శ్రీకాంత్ఇదీ చదవండి: ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం? -
ఏమిటీ సింధూ నదీ జలాల ఒప్పందం?
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత సర్కార్ సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఈ నదీజలాల అంశం చర్చనీయాంశమైంది. ఘర్షణతో మొదలై ఒప్పందం దాకా..ఇరు దేశాల మధ్య విస్తరించి ఉన్న సింధూ నది, దాని ఉపనదుల జలాలను సాగు కోసం, జలవిద్యుత్‌ఉత్పత్తి, జల రవాణా, చేపల వేట తదితరాల కోసం వినియోగించుకునేందుకుగాను భారత్, పాకిస్తాన్ దశాబ్దాల క్రితం ఒక ఒప్పందం చేసుకున్నాయి. దాదాపు తొమ్మిదేళ్లపాటు విస్తతస్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్ 19వ తేదీన నాటి భారత ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌లు ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు. ఒప్పందంలో పేర్కొన్న మేరకు సింధూ ఉపనదుల్లో తూర్పువైపుగా ప్రవహించే రావి, బియాస్, సట్లైజ్ నదులపై భారత్‌కు హక్కులు దఖలుపడ్డాయి. సింధూ ఉపనదుల్లో పశ్చిమ దిశగా ప్రవహించే జీలం, చినాబ్‌లపై పాకిస్తాన్‌కు హక్కులు లభించాయి. ఈ నదీ జలాల వినియోగం, ఇరు దేశాల మధ్య ఉత్తరప్రత్యత్తరాల కోసం ఒక సహకార యంత్రాంగాన్ని నెలకొల్పారు. ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా పరస్పర సహకారం భావనతో నదీజలాలను సద్వినియోగం చేసుకోవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం. భారత్ తన పాక్షిక హక్కు మేరకు పాకిస్తాన్ పరిధిలోని పశ్చిమ ఉపనదుల జలాలనూ పరిమితంగా వాడుకోవచ్చు. వ్యవసాయం, జలవిద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించుకోవచ్చు. అయితే పశ్చిమ దిశగా ప్రయాణించే జలాలు పాకిస్తాన్లోకి వెళ్లకుండా అడ్డుకోకూడదు. ఈ ఒప్పందంలో భాగంగానే గతంలోనే శాశ్వత సింధూ కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ఈ కమిషన్‌లో ఇరు దేశాలకు ప్రాతినిధ్యం ఉంది. ఇరు దేశాలు తమ అభ్యంతరాలను ఈ శాశ్వత కమిషన్ ద్వారా చెప్పుకోవచ్చు. ఈ నదీజలాలపై ఉద్దేశపూర్వకంగా డ్యామ్‌లను నిర్మించి, హఠాత్తుగా నీటిని వదిలి నీటిబాంబులుగా మార్చకూడదని షరతు పెట్టుకున్నారు. గడచిన ఆరు దశబ్దాల్లో ఈ నదీప్రవాహాల వెంట భౌగోళికంగా, రాజకీయంగా, పర్యావరణపరంగా చాలా మార్పులొచ్చాయి. జీలంకు ఉపనది అయిన కిషన్‌గంగ నదిపై భారత్ జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మించింది. దీనిపై పాకిస్తాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. ప్రాజెక్టు కారణంగా తమ భూభాగంలోకి నదీజలాల ఉధృతి బాగా తగ్గిపోయిందని సింధూ నదీజలాల ఒప్పందానికి భారత్ తూట్లు పొడుస్తోందని పాకిస్తాన్ వాదిస్తోంది. భారత్, పాక్‌ల మధ్య గతంలో 1965, 1971, 1999లో యుద్ధాలు జరిగినా, పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్నా సింధు జలాల ఒప్పందం అమలుకు నిరాటంకంగా కొనసాగడం విశేషం. అయితే ఇటీవలి కాలంలో డ్యామ్‌ల నిర్మాణం, నీటి వినియోగం తదితర అంశాలపై వివాదాలు ఎక్కువయ్యాయి. కిషన్‌గంగ, రాట్లే ప్రాజెక్టులపై పంచాయతీని పాకిస్తాన్ ప్రపంచబ్యాంక్ దాకా తీసుకెళ్లింది. అయితే తాజాగా ఒప్పందం నుంచి తాత్కాలికంగా భారత్ వైదొలిగితే ఇకపై కేంద్రప్రభుత్వం తనకు నచ్చినట్లు ప్రవర్తించే వీలుంది. అంటే జీలం, చినాబ్, రావి, బియాస్, సట్జైజ్ నదీజలాలు పాకిస్తాన్‌కు స్వేచ్ఛగా ప్రవహించకుండా డ్యామ్‌లు కట్టే వీలుంది. అప్పుడు పాకిస్తాన్‌కు నీటి కష్టాలు పెరుగుతాయి. దీంతో దాయాదిదేశాన్ని జలసంక్షోభం చుట్టుముడుతుంది. – సాక్షి, నేషనల్ డెస్క్ . -
పాక్‌కు భారత్ నోటీసులు.. సింధు జలాల ఒప్పందం మార్చుకుందామా?
సింధునది జలాల(ఇండస్ వాటర్ ట్రిటీ(ఐడబ్య్లూటీ)) విషయమై పాకిస్తాన్‌కు, భారత్‌కు మధ్య చాలా ఏళ్లు విభేదాలు ఉన్నాయి. ఐతే ఇప్పుడూ అనూహ్యంగా ఈ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సింధు నది జలాల ఒప్పందం మార్చుకుందాం అంటూ భారత్ పాక్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు భారత్ సింధు జలాల కమిషనర్ల ద్వారా జనవరి 25న పాక్‌కు నోటీసులు పంపింది. ఈ నోటీసు ప్రకారం.. పాక్ భారత్‌ల మధ్య ఈ విషయమై 90 రోజల్లోగా చర్చలు జరగాల్సి ఉంటుంది. అలాగే ఈ 62 ఏళ్లలో నేర్చుకున్న పాఠాల ఆధారంగా ఈ వివాదాన్ని సరైన విధంగా పరిష్కారించుకుని అప్డేట్ చేసుకునేందుకు మార్గం సుగం అవుతుంది. వాస్తవానికి కిషన్ గంగా, రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌ల(హెచ్ఈపీ) వివాదాల పరిష్కారంలో పాక్ వ్యవహిరించిన మొండితనం కారణంగానే భారత్ ఈ నోటీసులు ఇచ్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. 2015లో తొలిసారిగా పాక్ భారత్‌కు చెందిన కిషన్ గంగా, రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టులపై సాంకేతిక అభ్యంతరాలను పరిశీలించేందుకు నిపుణుడిని నియమించాల్సిందిగా కోరింది. ఆ తదనంతరం 2016లో పాక్ తన అభ్యర్థనను ఏకపక్షంగా ఉపసంహరించుకుంది. తన అభ్యంతరాలను మధ్యవర్తిత్వ న్యాయస్థానం ద్వారా నిర్ణయించాలని పాక్ సూచించింది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించి... ఈ వ్యవహారాన్ని తటస్థ నిపుణుడికి అప్పగించాలని ప్రపంచ బ్యాంకును కోరింది. 2016లో ప్రపంచ బ్యాంకు స్పందిస్తూ.. ఇరు దేశాల అభ్యర్థనను నిలిపివేసింది. ఈ విషయంలో శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాల్సిందిగా ఇరు దేశాలను సూచించింది. ఐతే పాక్ ఒత్తిడి మేరకు ప్రపంచ బ్యాంకు తటస్థ నిపుణుడితో పాటు మద్యవర్తిత్వ కోర్టు ప్రకియ రెండింటిని ప్రారంభించింది. దీంతో భారత్ స్పందించి. .ఒకే విషయంపై రెండు చర్యలు తీసుకోవడం అంటే.. సిందు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడం కిందకే వస్తుందని ఆరోపణలు చేసింది. 2017 నుంచి 2022 వరకు ఈ విషయమై పరిష్కారం కోసం భారత్ నిరంతరం ప్రయత్నించినప్పటికీ..ఈ విషయాన్ని చర్చించేందుకు పాక్ నిరాకరించింది. తరుచుగా ఒప్పంద నియమాలకు పాక్ ఆటంకం కలిగించింది. అందువల్లే భారత్ బలవంతంగా పాక్‌కు ఈ నోటీసులు జారీ చేసిందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం ఎప్పుడూ ఏర్పడిందంటే... వాస్తవానికి భారత్ పాక్‌ల మధ్య 1960 సెప్టెంబర్ 19న సింధు జలాల ఒప్పందం(ఇండస్ వాటర్ ట్రిటీ(ఐడబ్ల్యూటీ) జరిగింది. ఈ ఒప్పందంపై భారత్ మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రు, పాక్ మాజీ ప్రధాని అయాబ్ ఖాన్ ఇద్దరూ సంతకాలు చేశారు. ఆ తర్వాత కొన్నేళ్ల సుదీర్ఘ చర్చల అనంతరం.. ప్రపంచ బ్యాంకు సహకారంతో ఇరుదేశాలకు జలాల పంపకాలు జరిగాయి. ఈ సింధు జలాల ఒప్పందంలో భాగంగా భారత్‌కు సట్లైజ్, బియాస్, రావి నదులు, పాక్‌కు జీలం, చినాబ్, సింధు నదులు దక్కాయి. (చదవండి: రాహల్ జోడో యాత్రకు సడెన్ బ్రేక్! కేవలం కిలోమీటర్ తర్వాతే..) -
సింధు నది ఒప్పందంపై పాక్ గగ్గోలు
-
మోదీపై విషం కక్కుతున్న పాక్ మీడియా
రక్తం నీరు ఒకేసారి కలిసి ప్రవహించలేవంటూ సింధు నదీ జలాలపై సమావేశంలో భారత ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు పాక్ పేపర్లలో బ్యానర్లు అయ్యాయి. దీంతోపాటు పాకిస్తాన్ లో రక్తం ఏరులై పారడానికి భారత గూడచర్య సంస్ధ రీసెర్చ్ ఎనాలసిస్ వింగ్(రా) కారణమన్న పాక్ జనరల్ రహీల్ షరీఫ్ వ్యాఖ్యలను కూడా ఆ దేశ పేపర్లు పెద్ద ఎత్తున ప్రచురించాయి. బుర్హాన్ వానీ కాల్చివేత ఘటన తర్వాత నుంచి ఇరుదేశాల మీడియాలు స్పష్టమైన వైఖరితో కథనాలు రాస్తున్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుష్మా స్వరాజ్, రా లపై వివిధ పాక్ పేపర్లు చేసిన కామెంట్లు ఇలా ఉన్నాయి. ఎక్స్ ప్రెస్ ట్రైబ్యూన్ నిజం: ప్రపంచబ్యాంకు భారత్ తో సంప్రదింపులు జరిపి పాకిస్తాన్ తో సింధు నదీ జలాలపై ఒప్పందాన్ని కుదిర్చింది. రాసింది: ఉడీ ఉగ్రదాడి అనంతరం భారత ప్రధాని పాకిస్తాన్ పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉన్న ఒకే ఒక కీలక ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చూస్తున్నారు. దీని ద్వారా పాకిస్తాన్ కు చుక్కనీరు కూడా దొరకకుండా చేయడానికి సాహసిస్తున్నారు. పాకిస్తాన్ అబ్జర్వర్ సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ తనంతట తాను మార్చలేదని(లేదా) రద్దు చేసుకోలేదని రాసింది. 1960లో ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వం వహించి ఈ ఒప్పందాన్ని కుదిర్చినట్లు పేర్కొంది. సింధు నదీ జలాల ఒప్పందం అతి పవిత్రమైనది పేర్కొన్న అబ్జర్వర్.. ఒప్పందానికి గ్యారెంటీగా ప్రపంచంలో శక్తిమంతమైన ఆర్ధిక వ్యవస్ధలు ఉండటంతో అందులోని కామా, ఫుల్ స్టాప్ లను కూడా భారత్ కదల్చలేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. డావ్న్ న్యూస్ పాకిస్తాన్ లో అత్యంత ప్రాచుర్యం కలిగిన ఈ పేపర్.. పాకిస్తాన్ పార్లమెంటు సమావేశాలు, భారత్ తో సంప్రదింపులను కలిపి ప్రధానవార్తగా ప్రచురించింది. పాక్ తో చర్చలు నిలిపివేయాలని భారత్ నిర్ణయించుకున్నట్లు తెలిసిందని పేర్కొంది. అయితే, దీనిపై భారత్ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదని తెలిపింది. డైలీ టైమ్స్ జనరల్ రహీల్ షరీఫ్ 'రా' పై చేసిన కామెంట్లను ప్రధాన వార్తగా ప్రచురించింది. కశ్మీర్ లో కల్లోలాలకు కారణం ఇండియన్ ఆర్మీకు చెందిన 'రా' దేనని ప్రచురించింది. అమాయక ప్రజల రక్తం చిందించడమే వారి లక్ష్యమని రాసింది. సుష్మా స్వరాజ్ స్పీచ్ ను కూడా మొదటి పేజీలో ప్రచురించిన టైమ్స్.. కశ్మీర్ ఆశలను పాక్ వదులుకోవాలని భారత్ చెబుతోందని పేర్కొంది. -
సింధు నది ఒప్పందంపై పాక్ గగ్గోలు
ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా తప్పుకోలేదు ఇంటర్నేషనల్ కోర్టుకు వెళుతామని వ్యాఖ్య ఇస్లామాబాద్: సింధు నది జలాల పంపిణీ ఒప్పందం నుంచి తప్పుకోవాలన్న భారత్ నిర్ణయంపై పాకిస్థాన్ గగ్గోలు పెట్టింది. ఈ ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తే.. తాము అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొంది. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో సింధు నదీ జలాలపై భారత్-పాకిస్తాన్ చర్చలను రద్దు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. నెత్తురు, నీళ్లు కలిసి ప్రవహించలేవంటూ ఈ ఒప్పందంపై సమీక్షా సమావేశంలో ప్రధాని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. 'అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారత్ ఏకపక్షంగా ఈ ఒప్పందం నుంచి తప్పుకోలేదు' అని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజిజ్ మంగళవారం పేర్కొన్నారు. పాక్ జాతీయ అసెంబ్లీని ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. కార్గిల్ యుద్ధం, సియాచిన్ సంఘర్షణ సమయంలోనూ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని గుర్తుచేశారు. ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధు నది ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేయలేదని, ఒప్పందాన్ని రద్దుచేయడానికిగానీ, ఒప్పందం నుంచి తప్పుకోవడానికిగానీ ఎలాంటి నిబంధనలు లేవని, ఇది కుదరదని సర్తాజ్ అజిజ్ పేర్కొన్నారు. -
పాక్ జీవనాడిపై దెబ్బ కొడదామా.. వద్దా?
-
పాక్ జీవనాడిపై దెబ్బ కొడదామా.. వద్దా?
న్యూఢిల్లీ: అస్థిర ప్రభుత్వాలు, ఉగ్రవాదం, అవినీతి యంత్రాంగం.. ఒక దేశానికి ఎన్ని అవలక్షణాలుండాలో అంతకుమించే ఉన్న పాకిస్థాన్ ఆర్థిక శక్తిగా కొనసాగుతుండటానికి ప్రధాన కారణం.. సింధూ నదీ జలాలు. పాక్ జీవనాడి అయిన ఈ నదీ జలాలపై 56 ఏళ్ల కిందట చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని లేదా పునఃసమీక్షించుకోవాని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం 'సింధు నదీ జలాల ఒప్పందం'పై పలువురు ఉన్నతస్థాయి అధికారులతో చర్చించారు. భేటీ అనంతరం జలవనరుల శాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాలు త్వరలోనే అందరికీ వెల్లడిస్తామని వ్యాఖ్యానించారు. కాగా ఇదే సమావేశంలో ప్రధాని మోదీ.. 'భారత్,పాక్‌ల మధ్య నెత్తురూ, నీళ్లూ ఒకేసారి ప్రవహించలేవు'అని అన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సెప్టెంబర్ 18నాటి ఉడీ ఉగ్రదాడి అనంతరం దౌత్యపరంగా, వ్యూహాత్మకంగా పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెబుతామని ప్రకటించిన మోదీ ప్రభుత్వం ఆమేరకు 1960నాటి సింధూ నదీ జలాల ఒప్పందంపై దృష్టిసారించింది. సోమవారంనాటి ఉన్నతస్థాయి భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జైశంకర్, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ శశిశేఖర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను తిరిగి క్యాబినెట్ భేటీలో చర్చించిన తరువాతే సింధూ జలాల ఒప్పందంపై ప్రధాని తుది నిర్ణయాన్ని వెల్లడిస్తారు. ఆ తర్వాత ఇదే విషయాన్ని పాకిస్థాన్ తో చర్చిస్తారు. పాక్‌ను మనం కొడితే.. చైనా మనని కొడుతుంది! పాక్ జీవనాడిపై దెబ్బ కొడితే ఆ దేశం కకావికలం కావడం ఖాయం. ప్రపంచంలోనే అద్భుతమైన నీటిపారుదల వ్యవస్థల్లో ఒకటైన సింధూ డెల్టాయే పాకిస్థాన్ కు ఆదరువు. పలు ఫ్రావిన్స్ లను సస్యశామలం చేసే సింధూ నది.. కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధుతోపాటు దీని ఉపనదులైన జీలం-చినాబ్-బియాస్-రావి-సట్లెజ్ నదులపై 1960లో నాటి భారత్ పాక్ ప్రధానులు జవహర్ లాల్ నెహ్రూ, అయూబ్ ఖాన్ లు ఒప్పందం కుదుర్చుకున్నారు. తద్వారా తూర్పు నదులైన బియాస్, రావీ, సట్లెజ్ నదులపై భారత్‌కు, పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలంపై పాక్‌కు నియంత్రణ లభించింది. లు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. తూర్పు నదులైన బియాస్, రావీ, సట్లెజ్ నదులపై భారత్‌కు, పశ్చిమ నదులైన సింధు, చీనాబ్, జీలంపై పాక్‌కు నియంత్రణ లభించింది. అయితే సింధూ ప్రారంభస్థానం చైనాలో ఉన్నందున భారత్ తీసుకోబోయే ఎలాంటి నిర్ణయానికైనా అడ్డుపడే అవకాశం ఆ దేశానికి ఉంది. తన ఆధీనంలోని సింధు జలాలను భారత్ లోకి రానీయకుండా చైనా అడ్డుకుంటే ప్రస్తుతం మనం వాడుకుంటున్న 36 శాతం నీళ్లు కూడా దక్కకుండా పోతాయి. అంతేకాదు తన స్నేహితుడు పాకిస్థాన్ పై భారత చర్యకు ప్రతీకారంగా చైనా బ్రహ్మపుత్ర ప్రవాహాన్ని కూడా అడ్డుకునే అవకాశాలున్నాయి. చైనాగానీ బ్రహ్మపుత్ర జలాలను అడ్డుకుంటే తూర్పు, ఈశాన్య రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్ ఘోరంగా దెబ్బతింటాయి. అదీగాక భారత్- పాకిస్థాన్-చైనాలు సంయుక్తంగా ఇప్పటివరకు ఎలాంటి అంతర్జాతీయ జల ఒప్పందాలు చేసుకోలేదు. కశ్మీర్ నీట మునగటం ఖాయం సింధూ జలాలను ఉన్నపళంగా అడ్డుకుంటే గనుక భారత్.. అంతర్జాతీయ నదీ జలాల చట్టాలను ఉల్లంఘించినట్లవుతుంది. పాక్ ను ఒంటరి చేయాలనే నిర్ణయాన్ని సమర్థించేవారి విశ్వాసాన్ని కూడా కోల్పోయేప్రమాదం ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా సింధూ జలాలను సరైన పద్ధతిలో మళ్లించలేకపోతే కశ్మీర్ మొత్తం నీట మునుగుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడే నదీ జలాల అడ్డుకట్ట ఉండదు. అయితే ఒప్పందాలను మాత్రమే రద్దు చేసుకుని పాక్ పై ఒత్తిడిపెంచాలని భారత్ భావిస్తోంది.