వైద్యం వికటించి బాలుడి మృతి
వైద్యం వికటించి బాలుడి మృతి
Published Thu, Nov 24 2016 11:28 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM
మృతదేహంతో ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన
రౌతులపూడి : రౌతులపూడిలో విజయ ప్రైవేటు ఆసుపత్రిలో మూడురోజులుగా చికిత్సపొందుతున్న బలరామపురానికి చెందిన బొప్పన శ్రీరామత్రినా«థ్(3) బాలుడు వైద్యం వికటించటంతో గురువారం మృతిచెందాడని బంధువులో ఆరోపించారు. ఈ మేరకు మృతిని తల్లిదండ్రులు బొప్పన వీరవెంకటనాగ సత్యనారాయణ, దుర్గాదేవి దంపతులు, వారి కుటంబసభ్యులతో కలిసిచిన్నారి మృతదేహంతో ఆస్పత్రి ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. మృతిని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
మండలంలోని బలరామపురం గ్రామానికి చెందిన బొప్పన వీరవెంటకట నాగసత్యనారాయణ, దుర్గాదేవి దంపతుల ఏకైక కుమారుడు శ్రీరామత్రినా«థ్. మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో కుక్కర్‌లో మరుగుతున్న పాలు బాలుడిపై ఒలిగిపోయాయి. శరీరమంతా గాయమై పిల్లాడు గుక్కపెట్టి యడవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రౌతులపూడిలోని విజయక్లినిక్ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలోని వైద్యుడు కె.విజయ్‌కుమార్(అబ్బులు) బాలుడుకి పరీక్షలు నిర్వహించి మూడురోజుల్లో గాయాలు తగ్గిపోతాయని చెప్పి, చికిత్స ప్రారంభిచారు. బుధవారం బాలుడు పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఇక్కడ నయం కాకపోతే చెప్పండి వేరే ఆసుపత్రికి తీసుకెళతామని వైద్యుడిని అడిగారు. ఏం పర్వాలేదు నేను బాగుచేస్తానని చెప్పడంతో వారు ఊరట చెందారు. బుధవారం రాత్రి చనిపోయిన బాలుడిని గురువారం తెల్లవారుజామున ఐదుగంటలకు బాలుడు కోమాలోకి వెళ్లిపోయాడు వెంటనే వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని బంధువులకు, ఇతర కుటుంబ సభ్యులకు వైద్యుడు విజయకుమార్ సూచించారు. దీంతో ఆందోళన చెందిన వారు తునిలోని ఒక ప్రైవేట్ ఆప్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు బాలుడిని పరీక్షించి మృతిచెంది చాలా సమయమైందని తెలిపారు. దీంతో కంగుతిన్న కుటుంబ సభ్యులు రౌతులపూడి సినిమాసెంటర్లో ఉన్న ఆస్పత్రి ఎదుట బాలుడి మృతదేహంతో ఆందోళనకు దిగారు. విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దారు వీరేష్, వీఆర్వో నాగు ఘటన స్థలానికి వచ్చి విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు. ఈ సంఘటనపై పోలీసులకు సమాచారమిస్తామని బంధువులు తెలిపారు.
Advertisement
Advertisement