న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నోటీసులు జారీ చేసింది. ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే అంశంపై 14 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. ఈనెల 9న హరియాణాలోని ఖర్ఖోడ గ్రామంలో డోప్ టెస్టు నిర్వహించాలనుకుంటే ఆ సమయంలో వినేశ్ అందుబాటులో లేకపోవడంతో ‘నాడా’ ఈ నోటీసులు జారీ చేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన వినేశ్ ఫొగాట్... వంద గ్రాములు అధిక బరువు కారణంగా అనర్హతకు గురైంది.
ఆ తర్వాత కెరీర్‌కు వీడ్కోలు పలికి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వినేశ్... హరియాణాలోని జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యరి్థగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచింది. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న వినేశ్ హరియాణాలో విసృతంగా పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే వివరాలు అందించనందుకు గానూ వినేశ్‌కు నోటీసులు అందించాం. డోప్ నిరోధక అధికారి హాజరైన సమయంలో వినేశ్ అందుబాటులో లేదు. అందుకే ఈ నోటీసులు జారీ చేశాం’ అని ‘నాడా’ నోటీసులు పేర్కొంది. నిబంధనల ప్రకారం ఏడాది కాలంలో మూడుసార్లు వివరాలు అందించడంలో విఫలమైన అథ్లెట్లపై ‘నాడా’ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment