పుణెలో మైనర్ బాలుడి డ్రైవింగ్ కారణంగా ఇద్దరు యువ ఇంజనీర్లు ప్రాణాలు కోల్పోయారు. కారుని గంటకు 200 కి.మీ వేగంతో ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అంతేగాదు ఈ ప్రమాదానికి ముందు పంబ్‌లో సంబరాలు చేసుకోవడమే గాక ఏకంగా రూ. రూ. 48 వేలు ఖర్చు పెట్టి మరీ మందు తాగినట్లు తేలింది. నిజానికి మహారాష్ట్రలో 25 ఏళ్లు దాటిన వారికే మద్యం సేవించేందుకు అనుమతి ఉంది. ఇక్కడ నిందితుడికి కొద్ది గంట్లలోనే షరతులతో కూడిన బెయిల్ రావడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాదు నిందుతుడి తండ్రిని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ దిగ్బ్రాంతికర ఘటన యావత్తు దేశాన్ని ఒక్కసారిగా ఉలక్కిపడేలా చేసింది. ఇక్కడ సరిగాలేని చట్టాలది తప్పా? లేక నిందితుడిని అలా పెంచిన తల్లిదండ్రులది తప్పా? దీనికి ఎవరు బాధ్యులు? ఎవరదీ ఈ పాపం..?
యావత్తు దృష్టిని ఆకర్షించిన ఈ ప్రమాదం అతిపెద్ద ప్రజాస్వామ్యంలో జరిగిన భయానక దిగ్బ్రాంతికర ఘటనగా చెప్పొచ్చు. 17 ఏళ్లు మైనర్ రూపంలో మృత్యువు ఎన్నోకలలతో ఉన్న ఇద్దరు యువతీయుకుల జీవితాలను బలితీసుకుంది. రెండు కుంటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంత ఘోరానికి పాల్పడ్డ నిందితుడు కొద్ది గంటల్లోనే బెయిల్‌పై రావడమే గాక మేజర్ కాదు కాబట్టి శిక్షార్హడు అని కోర్టు పేర్కోనడమే అత్యంత కలిచివేసే విషయం.
ఇక్కడ మైనర్ ఎంత పెద్ద నేరం చేసిన శిక్ష పడకుండా తప్పించుకోగలుగుతున్నందుకు బాధపడాలో లేక తల్లిదండ్రుల పెంపకానికి రెండు నిండు జీవితాలు బలైనందుకు కలత చెందాలో తెలియని స్థితి. ఈ ఘటన ఒక్క విషయం చెప్పకనే చెప్పింది. తల్లిదండ్రుల పెంపక వైఫల్యతకు నిదర్శనమే ఈ ఘటన అని చెంపదెబ్బ కొట్టినట్లు చెప్పకనే చెబుతోంది.
మేజర్ కానివాడికి విలావంతమైన కారు ఇవ్వడం ఒక తప్పు అయితే..ఖర్చుపెట్టుకోమని అంతంత డబ్బు ఇస్తున్నారంటే..తల్లిదండ్రులుగా వాళ్లకు ఏం చెబుతున్నారో అర్థమవుతోంది. ఇక్కడ తల్లిదండ్రులు మేము ఒళ్లు గుల్ల చేసుకుని డబ్బులు సంపాదించేస్తాం..మీరు విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి తాగితందనాలు ఆడి బీభత్సం సృష్టించమని చెబుతున్నారా? అని అనలా. ఏదైనా మొక్కగా ఉన్నప్పుడే సరిచేయాలి. విలాసవంతమైన వస్తువులు కొనివ్వగలిగే స్తోమత ఉన్న తల్లిదండ్రులు రెండు విషయాలు తప్పక గుర్తించుకోవాలి.
కొన్నింటికి నో చెప్పడం ముఖ్యం..
ఒకటి దీనివల్ల వాడికి ప్రయోజనం ఉంటుందా లేదా గ్రహించాలి. రెండు ఎంత వరకు ఆ లగ్జరియస్ వస్తువు పిల్లలకు అవసరం అనేది కూడా గమనించాలి. స్నేహితుల ప్రభావంతో స్టేటస్ ఆఫ్ సింబల్‌గా విలాస వస్తువులు కావాలనుకుంటున్నారా? అన్నది కూడా తల్లిదండ్రులుగా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం. ప్రతి తల్లిదండ్రులు స్తోమత ఉన్నా లేకపోయినా విలావంతమైన వస్తువులకు 'నో' చెప్పాలి. అంతేగాదు తల్లిదండ్రులుగా ప్రతిదానికి 'ఎస్' అని చెప్పడం కాదు నో అని చెప్పి కట్టడి చేయడం వంటివి కూడా చేయాలి.
ఒక వస్తువు కొనేందుకు ఖర్చు అవుతున్న డబ్బులు అందుకోసం మీరు పడుతున్న కష్టం గురించి విడమరిచి చెప్పాలి. చాలామంది చేసే ప్రధానమైన తప్పు ఏంటంటే..ప్రతీది కాదంటే వారు నొచ్చుకుంటారు,స్నేహితుల ముందు చిన్నబోతారని భావిస్తుంటారు. పైగా పిల్లలు కదా..!పోనీలే అనే భావన కూడా అస్సలు వద్దు. మీ ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు ఎంత ఖరీదైనదేనా కొనిచ్చేస్తారు..ఆ తర్వాత ఏంటీ..? అనేది అతిపెద్ద ప్రశ్న..?. అనేది గుర్తుపెట్టుకోండి.. పిల్లల భవిష్యత్తు భద్రమైన వస్తువులు కొనివ్వండి. గారాభంగా పెంచడం తప్పుకాదు. ముద్దుగా, గారాభంగా పెంచుతూనే బాధ్యతలను, విలువలను నేర్పించాలి. ముఖ్యంగా ప్రయోజకులుగా మారకపోయిన పర్లేదు గానీ ఇతరులకు హాని తలపెట్టే వారిగా, అందరూ అసహ్యించుకునేవారిలా మాత్రం తయారవ్వనివ్వకండి.
(చదవండి: ఫిష్ ఆయిల్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా? అధ్యయనంలో షాకింగ్ విషయాలు!)
Comments
Please login to add a commentAdd a comment