మీకు చేతకాక.. విమర్శలా?
– ఉమ, బుద్దాలపై విష్ణు ధ్వజం
– కేవీపీ కృషితోనే హోదాపై కదలిక
విజయవాడ :
వారి చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, బుద్దా వెంకన్నలు కేవీపీ రామచంద్రరావుపై విమర్శలు చేస్తున్నారని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణు అన్నారు. శనివారం ఆంధ్రరత్నభవనంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రత్యేకహోదా విషయంలో అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నేతలు కేవీపీని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై కేవీపీ రాజ్యసభలో ప్రైవేటు బిల్లుగా ప్రవేశపెట్టాకే కదలిక వచ్చిందన్నారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నేతలు చేతకానివారని తేలిందన్నారు.
కార్పొరేషన్‌కు బోగస్ అవార్డులు
నగరం అనేక సమస్యలతో అల్లాడుతుంటే నగర పాలక సంస్థకు బోగస్ అవార్డులు తెచ్చి, లేనిపోని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఒక పక్క డంపింగ్ యార్డులేక ప్రజలు అగచాట్లు పడుతున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమైన నగర పాలక సంస్థ పాలకవర్గం తమ ౖÐð ఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలపై విమర్శలు చేయటం తగదన్నారు. కార్యక్రమంలో పీసీసీ నేత కొలనుకొండ శివాజీ పాల్గొన్నారు.