మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి
వరంగల్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్వర్యంలో చేçపడుతున్న రెండో విడత ‘ప్రజా పరిరక్షణ చైతన్య బస్సుయాత్ర’ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈనెల 3న ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. హన్మకొండలోని కాంగ్రెస్ భవన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 3న (మంగళవారం) సాయంత్రం బస్సుయాత్ర భూపాలపల్లికి చేరుకుంటుందన్నారు. 4న మధ్యాహ్నం 2గంటలకు స్టేషన్ ఘనపూర్, అదే రోజు సాయంత్రం 6గంటలకు పాలకుర్తిలో యాత్ర కొనసాగుతుందన్నారు. 5వ తేదీ సాయంత్రం 6గంటలకు నర్సంపేటలో కొనసాగించి వరంగల్‌లో రాత్రి బస చేస్తారని తెలిపారు. 6న పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలలో, 7వ తేదీన కొత్తగూడెం జిల్లా ఎల్లందు టేకులపల్లి, పినపాక మండలంలో యాత్ర కొనసాగుతుందన్నారు. 8న డోర్నకల్, మహబూబా బాద్‌లో యాత్ర నిర్వహిస్తారన్నారు.
9వ తేదీ ఉదయం భద్రాచలం వెంకటాపురంలో బిల్ట్ కార్మికులతో పీసీసీ బృందం చర్చిస్తుందని తెలిపారు. సాయంత్రం 5గంటలకు ములుగు సభలో పాల్గొంటారని, 10వ తేదీ సాయంత్రం 4 గం టలకు వర్ధన్నపేటలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం బస్సు యాత్ర ముగుస్తుందన్నారు. బస్సుయాత్రను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు విజయరామారావు, వేం నరేందర్‌రెడ్డి, కొండేటి శ్రీధర్, సీతక్క, డీసీసీబీ మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, నాయకులు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, నమిండ్ల శ్రీనువాసు, రవళీ, రహత్ పర్వీన్, మహ్మద్ అయూబ్, కొత్తపెల్లి శ్రీనివాస్, బిన్ని లక్ష్మన్, రమణారెడ్డి, రోహిత్‌సింగ్‌ఠాకూర్, మండల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ బస్సు యాత్ర సందర్భంగా ఏర్పాటు చేయనున్న సభ జరిగే కేడీసీ మైదానాన్ని నాయకులు సందర్శించి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment