అఫ్ఘనిస్తాన్ నుంచి యూఎస్ బలగాలు నిష్క్రమిస్తున్న సమయంలో చోటు చేసుకున్న విషాద ఘటనలకు సంబంధించి సమీక్షను వైట్‌హౌస్ విడుదల చేసింది. సుదీర్థకాల నిరీక్షణల అనంతరం విడుదల చేసిన ఈ సమీక్షలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సరిగ్గా ఆగస్టు 2021 నాటి బలగాల ఉపసంహరణ సమయంలో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ వైపల్యాలపై దర్యాప్తు చేపట్టింది అమెరికా భద్రతా మండలి.
ఈ మేరకు జాదీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ నాటి నిష్క్రమణలో పొరపాట్లు జరిగాయిని అంగీకరించారు. అందువల్లే కొద్ది వారల్లోనే తాలిబాన్లు అఫ్ఘనిస్తాన్‌ను నియంత్రణలోకి తెచ్చుకుని స్వాధీనం చేసుకుంది. చివరికి అమెరికన్ బలగాలు, దాని మిత్ర దేశాలు అప్పటికప్పుడూ అకస్మాత్తుగా నిష్క్రమించక తప్పలేదంటూ సంచలన విషయాలను బయటపెట్టారు. ఏ యుద్ధమైన ముగించడం అనేది అంత తేలికైన పని కాదన్నారు. ఈ నిష్క్రమణలో దారితీసిన పరిస్థితులకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమని పేర్కొన్నారు. అలాగే అమెరికా గూఢచార్యం అఫ్ఘాన్‌లోని తాలిబాన్లు బలాన్ని, అక్కడి ప్రభుత్వ బలహీనతలను అంచనా వేయడంలో పూర్తిగా విఫలమైనట్లు తెలిపారు. అందుకు సంబంధించి ఇంటిలిజెన్స్ సరైన స్పష్టత ఇవ్వకపోవడంతోనే అలాంటి ఘటనలు తలెత్తాయని కిర్బీ చెప్పారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తన పరిపాలన హయాంలో 2020లో తాలిబాన్లతో చేసుకున్న ఒప్పందంలో పలు లోపాలున్నాయని , ఇది ఒకరకంగా బైడెన్ పాలనను ఏ నిర్ణయం తీసుకోలేని సందిగ్ధంలో పడేసిందన్నారు. దీంతో బైడెన్‌కి నిష్క్రమణ అనే పదాన్ని వెనక్కి తీసుకోలేని విపత్కర పరిస్థితి ఎదురవ్వడంతో.. ఆయన మరికొంత మంది యూఎస్ బలగాలను అఫ్ఘాన్ పంపించే సాహసం చేయలేకపోయినట్లు తెలిపారు. అలాగే ట్రంప్ తన పదవికాలం ముగింపు సమయంలోని చివరి 11 నెలలు నుంచి అఫ్ఘాన్‌లో యూఎస్ బలగాల ఉనికిని క్రమంగా తగ్గించారని, తదనంతరం జనవరిలో బైడెన్ అధ్యక్షుడిగా చేపట్టే సమయానికి కేవల 2500 మంది సిబ్బంది మాత్రమే ఉన్నట్లు నివేదిక పేర్కొంది
. కాగా, కాబుల్‌లో ఆగస్టు 26న యూఎస్ బలగాల నిష్క్రమణ సమయంలో అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఆత్మాహుతి బాంబు దాడిలో సుమారు 13 యూఎస్ దళాలు, 170 మంది అఫ్ఘాన్‌లు మరణించిన సంగతి తెలిసింది. దీంతో యూఎస్ కొన్ని విమానాలను పంపించి బలగాలను వెనక్కి తీసుకొస్తున్న క్రమంలో..అక్కడి అఫ్ఘాన్ పౌరుల తాలిబాన్లను నుంచి తప్పించుకునేందుకు విమానాలను చుట్టుమట్టిన దిగ్బ్రాంతికర దృశ్యాలు అందర్నీ కలిచి వేశాయి.
(చదవండి: కిడ్నాప్ నాటకంతో డబ్బుల కాజేయాలనుకుంది..కానీ చివరికీ ఆ భార్య..)
Comments
Please login to add a commentAdd a comment