
టీ20 ప్రపంచకప్-2022 సన్నాహాకాలలో భాగంగా టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఇరు జట్లు చెరో విజయంతో 1-1తో సమంగా నిలిచాయి. ఈ క్రమంలో సిరీస్ ఫలితాన్ని తెల్చే మూడో టీ20 ఆదివారం హైదరాబాద్ వేదికగా జరగనుంది.
ఈ మ్యాచ్ కోసం టీమిండియా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఇరు జట్ల ఆటగాళ్లను భారీ భద్రత మధ్య హొటల్‌కు తరలించారు. ఇరు జట్లు కోసం రెండు ప్రత్యేక బస్సులను హెచ్‌సీఏ ఏర్పాటు చేసింది.
కాగా నాగ్‌పూర్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో ఆసీస్‌పై భారత్ ఘనవిజయం సాధించింన సంగతి తెలిసిందే. ఈమ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ 20 బంతుల్లో 46 పరుగులుతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
చదవండి: Roger Federer: ఫెదరర్ ఆఖరి మ్యాచ్‌లో ఓటమి! నాదల్ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment