స్వదేశంలో భారత్-ఆస్ట్రేలియా టీ20 సిరీస్ తుది దశకు చేరుకుంది. నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 6వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 1-1తో సమం చేసింది. ఇక సిరీస్ ఫలితాన్ని తేల్చే అఖరి టీ20 ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది.
ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కీలక మ్యాచ్‌లో భారత జట్టులో పలు మార్పులు చోటు చేసుకోనే అవకాశం ఉంది. భారత్ బ్యాటింగ్ పరంగా పటిష్టంగా ఉన్నప్పటికీ.. బౌలింగ్, ఫీల్డింగ్‌లో మాత్రం అంతగా రాణించపోతుంది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20 పూర్తిగా తేలిపోయిన భారత బౌలర్లు.. రెండో టీ20లో కాస్త పర్వాలేదనిపించారు.
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అదే విధంగా స్పిన్నర్ అక్షర్ పటేల్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. కాగా గత రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన హర్షల్ పటేల్ స్థానంలో తిరిగి భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
అదే విధంగా పంత్ స్థానంలోపేసర్ దీపక్ చాహర్ తుది జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారీగా పరుగులు సమర్పించుకుంటున్న స్పిన్నర్ చాహల్ స్థానంలో అశ్విన్‌ను తీసుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం.
భారత తుది జట్టు (అంచనా)
కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, అశ్విన్, దీపక్ చాహర్.
చదవండి: 2007 T20 World Cup: 'శ్రీశాంత్ బంతిని పట్టుకోలేదు.. ప్రపంచకప్‌ను పట్టుకున్నాడు'
Comments
Please login to add a commentAdd a comment