ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో బారత్ ఓటమి పాలైంది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 202 పరుగులకు ఆలౌటైంది.
ఇంగ్లండ్ అరంగేట్ర స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ 7 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(39) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా లక్ష్య ఛేదనలో 119 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్, శ్రీకర్ భరత్ నిలకడగా ఆడుతూ భారత విజయంపై ఆశలు రెకెత్తించారు. ఎనిమిదో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే టామ్ హార్ట్‌లీ భరత్‌ను ఔట్ చేయడంతో మళ్లీ మ్యాచ్ ఇంగ్లండ్ వైపు మలుపు తిరిగింది. వెంటనే అశ్విన్ కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటయ్యాడు.
అనంతరం సిరాజ్, బుమ్రా కాసేపు పోరాడనప్పటికీ ఓటమి నుంచి గట్టుఎక్కించ లేకపోయారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శర్మ(39) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఓవర్‌నైట్ స్కోర్ 316/6తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ అదనంగా 104 పరుగుల జోడించింది. రెండో ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఇంగ్లీష్ జట్టు ఆలౌటైంది.
దీంతో భారత్ ముందు 230 పరుగుల లక్ష్యాన్ని ఉంచగల్గింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో ఓలీ పోప్(196) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. కాగా అంతకముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులకు ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా(87), రాహుల్(86), జైశ్వాల్(80) పరుగులతో రాణించారు. అదే విధంగా ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నం వేదికగా జరగనుంది.
చదవండి: #Shubman Gill: నీవు మరి మారవా గిల్..? ఇంకా ఎన్ని ఛాన్స్‌లు! అతడిని తీసుకోండి?
Comments
Please login to add a commentAdd a comment