స్వదేశంలో ఇంగ్లండ్‌ను మరోసారి భారత్ మట్టికరిపించింది. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టులో 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలూండగానే 3-1 సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది.
రాంఛీ టెస్టులో 192 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి టీమిండియా ఛేదించింది. అయితే 40/0 ఓవర్ నైట్ స్కోర్ నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టు వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఉచ్చులో చిక్కుకున్న భారత బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.
120 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన క్రమంలో భారత జట్టును యువ ఆటగాళ్లు శుబ్‌మన్ గిల్(52), ధ్రువ్ జురెల్(39) అదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 72 పరుగుల ఆజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. వీరిద్దరితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ(55) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
11 ఏళ్ల తర్వాత మళ్లీ..
కాగా టెస్టుల్లో భారత గడ్డపై 150 పైగా పరుగుల లక్ష్యాన్ని టీమిండియా విజయవంతంగా చేధించడం గత 11 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. భారత జట్టు చివరగా 2013లో ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో 150 ప్లస్ టార్గెట్‌ను ఛేదించింది. తాజా విజయంతో చెత్త రికార్డును భారత్ చెరిపేసింది.
టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ నాలుగో టెస్టు స్కోర్లు
ఇంగ్లండ్ - 353 & 145
ఇండియా- 307 & 192/5
ఫలితం- ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ధ్రువ్ జురెల్
Comments
Please login to add a commentAdd a comment