రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. 219/7 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్.. అదనంగా 88 పరుగులు జోడించి ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం లభించింది.
ఇక భారత బ్యాటర్లలో దృవ్ జురల్ అద్బుతమైన పోరాట పటిమను కనబరిచాడు. తృటిలో తన తొలి సెంచరీ చేసే అవకాశాన్ని జురల్ కోల్పోయాడు. 149 బంతులు ఎదుర్కొన్న జురల్.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు.
అతడితో పాటు జైశ్వాల్(73), కుల్దీప్ యాదవ్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ 5 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు టామ్ హార్ట్‌లీ 3 వికెట్లు, జేమ్స్ ఆండర్సన్ రెండు వికెట్లు పడగొట్టారు.
కాగా అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలలో వెటరన్ ఆటగాడు జో రూట్(122) అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లతో సత్తాచాటగా.. ఆకాష్ దీప్ 3 వికెట్లు, సిరాజ్ రెండు, అశ్విన్ ఒక్క వికెట్ సాధించారు.
చదవండి: IND vs ENG: మీకు రూట్ ఉంటే.. మాకు కుల్దీప్ సార్ ఉన్నారు! అంతేగా?
Comments
Please login to add a commentAdd a comment