అరంగేట్ర మ్యాచ్‌లో సత్తాచాటిన టీమిండియా యువ వికెట్ కీపర్ దృవ్ జురల్.. తన రెండో మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. రాంఛీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో దృవ్ జురల్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రోహిత్ శర్మ, జడేజా, గిల్ వంటి స్టార్ బ్యాటర్లు విఫలమైన చోట జురల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన జురల్ ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ.. తన విరోచిత పోరాటాన్ని మాత్రం కొనసాగించాడు. లోయార్డర్ బ్యాటర్ కుల్దీప్ యాదవ్‌తో కలిసి భారత జట్టును ఈ యూపీ ఆటగాడు అదుకున్నాడు. కుల్దీప్‌తో కలిసి 76 పరుగుల భాగస్వామ్యాన్ని దృవ్ నెలకొల్పాడు. అయితే జురల్ దురదృష్టవశాత్తూ తృటిలో తన తొలి సెంచరీని చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
149 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో దృవ్ 90 పరుగులు చేశాడు. సెంచరీకి చేరువలో టామ్ హార్ట్‌లీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్‌కు చేరాడు. సెంచరీ చేయకపోయనప్పటికీ తన అద్బుత ఇన్నింగ్స్‌తో అభిమానుల మనసును ఈ యువ వికెట్ కీపర్ గెలుచుకున్నాడు. ఈ క్రమంలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక దృవ్ జురల్ విరోచిత పోరాటం ఫలితంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగుల మార్క్‌ను దాటింది.
మొదటి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు భారత్ ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ దిగిన ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లండ్ 149 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
చదవండి: PSL 2024: పొలార్డ్ విధ్వంసం.. ఆఖరి బంతికి గెలుపు! షాక్‌లో షాహీన్
Comments
Please login to add a commentAdd a comment