
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. బాజ్‌బాల్ అంటూ విర్రవీగిన ఇంగ్లండ్‌కు టీమిండియా సరైన సమాధానమే చెప్పింది. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన రిటైర్మెంట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను ఇక క్రికెట్ ఆడలేనని భావించిన రోజు రిటైర్మెంట్ ప్రకటిస్తానని హిట్‌మ్యాన్ తెలిపాడు.
"నేను క్రికెట్ ఆడేందుకు సరిపోనని భావించిన రోజు నా అంతట నేనే రిటైర్ అవుతాను. కానీ గత 2-3 ఏళ్లలో నా ఆట ఎంతో మెరుగుపడిందని" రోహిత్ పేర్కొన్నాడు. కాగా ఇటీవలే రోహిత్‌ను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
రోహిత్‌కు దూకుడుగా ఆడే వయస్సు అయిపోయిందని, అతడు రిటైర్ అయితే బెటర్ అని బాయ్‌కాట్ విమర్శించాడు. ఈ నేపథ్యంలో బాయ్‌కాట్ వ్యాఖ్యలకు రోహిత్ కౌంటర్ ఇచ్చినట్లైంది. కాగా ఈ సిరీస్‌లో రోహిత్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో రెండు సెంచరీల సాయంతో 400 పరుగులు చేశాడు.
చదవండి: IND Vs ENG: ఏంటి బషీర్ ఇది..? బౌల్డ్ అయితే రివ్యూనా? వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment