
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి రూ.కోటికి పైగా విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేసినట్లు ఏడీఈ బాలకృష్ణ మంగళవారం పేర్కొన్నారు. బిల్లులు చెల్లించకుండా కరెంటును యధావిధిగా వాడుకోవడంతో శాఖ అధికారులు హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్‌సీఏ)పై గతంలో విద్యుత్తు చౌర్యం కేసు నమోదు చేశారు. దీంతో హెచ్‌సీఏ కోర్టును ఆశ్రయించింది. కోర్టులో విద్యుత్తు శాఖకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇటీవల అధికారులు బకాయిల విషయమై హెచ్‌సీఏకు నోటీసులు జారీ చేసినా.. చెల్లించకపోవడంతో సరఫరా నిలిపేశారు.
చదవండి: (Nalgonda: నిశీధిలో ఏం జరిగింది..?)
Comments
Please login to add a commentAdd a comment