Ind Vs Nz 2nd Test: Irfan Pathan Comments On Virat Kohli Test Captaincy, Goes Viral - Sakshi
Sakshi News home page

Ind Vs Nz 2nd Test- Virat Kohli: రీసౌండ్‌.. దద్దరిల్లిపోలా! టీమిండియా అత్యుత్తమ టెస్టు కెప్టెన్‌ అతడే!

Published Mon, Dec 6 2021 6:13 PM | Last Updated on Mon, Dec 6 2021 8:53 PM

Ind Vs Nz 2nd Test: Virat Kohli Best Test Captain India Have Ever Had Irfan Pathan - Sakshi

PC: BCCI

Ind Vs Nz 2nd Test: Virat Kohli Best Test Captain India Have Ever Had Irfan Pathan: న్యూజిలాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆల్‌రౌండ్‌ ప్రతిభతో విజయం సాధించిన కోహ్లి సేనను భారత మాజీ ఆటగాళ్లు అభినందిస్తున్నారు. ఈ క్రమంలో టెస్టు స్పెషలిస్టు వీవీఎస్‌ లక్ష్మణ్‌... ‘‘సొంతగడ్డ మీద భారత్‌ విజయం.. సౌండ్‌ దద్దరిల్లిపోయింది.

అవుట్‌క్లాస్‌ న్యూజిలాండ్‌పై అద్బుత విజయం. మయాంక్‌.. అశ్విన్‌ ముందుండి నడిపించగా... సమష్టి కృషితో గెలుపొందింది’’ అని భారత జట్టును ఆకాశానికెత్తేశాడు. అయితే, చరిత్ర సృష్టించిన అజాజ్‌ పటేల్‌కు మాత్రం ఈ ఓటమి చేదు అనుభవమని పేర్కొన్నాడు.

ఇక భారత మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ ..‘‘పూర్తిస్థాయి ఆధిపత్య విజయాలు మరింత మధురంగా ఉంటాయి. శభాష్‌ టీమిండియా’’ అని హర్షం వ్యక్తం చేశాడు. అదే విధంగా టీమిండియా టెస్టు కెప్టెన్లలో అత్యుత్తమ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అని పునరుద్ఘాటించాడు. ఈ మేరకు.. ‘‘ఇంతకు ముందు చెప్పినట్లుగానే మరోసారి చెబుతున్నా... ఇప్పటి వరకు భారత టెస్టు కెప్టెన్లలో గొప్ప సారథి విరాట్‌ కోహ్లి!

తన విజయాల శాతం 59.09తో టాప్‌లో ఉన్నాడు’’ అని ప్రశంసించాడు. ఇక వీరేంద్ర సెహ్వాగ్‌, వసీం జాఫర్‌ తదితరులు టీమిండియా విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ విజయంతో భారత జట్టు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానానికి ఎగబాకింది. 

చదవండి: Virat Kohli- Ajinkya Rahane: రహానే ఫామ్‌.. నేను ఆ పని చేయలేను.. ఇంకెవరు కూడా.. కోహ్లి కౌంటర్‌!


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement