PC: IPL.com
Irfan Pathan best XI IN IPL 2022: ఐపీఎల్ 15వ సీజన్ ఆదివారంతో ముగిసింది. ఐపీఎల్-2022 చాంఫియన్స్‌గా గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో రాజస్తాన్‌పై గుజరాత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక ఈ ఏడాది సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అదరగొట్టాయి. హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ తొలి సీజన్‌లోనే టైటిల్‌ను ముద్దాడగా.. రాహుల్ కెప్టెన్సీలోని లక్నో ప్లే ఆఫ్స్‌లో తన ప్రయాణాన్ని ముగించింది. ముఖ్యంగా ఈ ఏడాది సీజన్‌లో ఆయా జట్ల యువ ఆటగాళ్లు దుమ్మురేపారు. అదే విధంగా దినేష్ కార్తీక్, చాహల్,కుల్ధీప్ యాదవ్ వంటి వెటరన్ ఆటగాళ్లు కూడా అద్భుతమైన ప్రదర్శన చేశారు.
ఈ క్రమంలో ఐపీఎల్-2022లో తన బెస్ట్ ఎలెవన్‌ను మాజీ భారత ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రకటించాడు. తన ఎంచుకున్న జట్టుకు హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా పఠాన్ ఎంచుకున్నాడు. అదే విధంగా ఓపెనర్లుగా జోస్ బట్లర్, కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశాడు. వరుసగా మూడు నాలుగు స్థానాల్లో సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యాకు చోటు ఇచ్చాడు. ఐదు ఆరు స్థానాల్లో లాయమ్ లివింగ్ స్టోన్, డేవిడ్ మిల్లర్‌కు చోటు దక్కింది. ఇక బౌలింగ్ ఆల్ రౌండర్లగా రషీద్ ఖాన్,హార్షల్ పటేల్‌ను పఠాన్ ఎంపిక చేశాడు. ఆదే విధంగా బౌలర్ల కోటాలో మహ్మద్ షమీ, యజువేంద్ర చహాల్, ఉమ్రాన్ మాలిక్‌కు అతడు అవకాశం ఇచ్చాడు. ఇక ఈ జట్టులో 12వ ఆటగాడిగా స్పిన్నర్ కుల్ధీప్ యాదవ్ ఎంపికయ్యాడు.
ఇర్ఫాన్ పఠాన్ ఐపీఎల్-2022 బెస్ట్ ఎలెవన్: జోస్ బట్లర్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్ (12వ ఆటగాడు- కుల్దీప్ యాదవ్)
చదవండి: IPL 2022: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఆశిష్ నెహ్రా.. తొలి ‘భారత’ హెడ్ కోచ్‌గా!
Comments
Please login to add a commentAdd a comment