
PC: IPL.COM
అరంగేట్ర సీజన్‌లోనే జట్టుకు టైటిల్‌ను అందించిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. హార్ధిక్ అద్భుతమైన కెప్టెన్సీ స్కిల్స్‌ను కలిగి ఉన్నాడని గవాస్కర్ కొనియాడాడు. అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో గుజరాత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఐపీఎల్-2022లో హార్ధిక్ పాండ్యా సారథిగా అద్భుతంగా రాణించాడు. ఈ ఏడాది సీజన్ లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలు సాధించి గుజరాత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక ప్రస్తుత సీజన్‌లో హార్ధిక్ బాల్‌తో,బ్యాట్‌తో కూడా అద్భుతంగా రాణించాడు. 15 మ్యాచ్‌లు ఆడిన హార్ధిక్ 487 పరుగుల తో పాటు, 8 వికెట్లు కూడా పడగొట్టాడు. ఇక రాజస్తాన్‌తో జరిగిన ఫైనల్లో కూడా పాండ్యా మూడు కీలక వికెట్లతో పాటు, 34 పరుగులు సాధించాడు.
ఇక పాండ్యాకి టీమిండియా కెప్టెన్సీ అవకాశాలు గురించి గవాస్కర్ మాట్లాడూతూ.. " హార్ధిక్ ఖచ్చితంగా భారత జట్టుకు సారథి అవుతాడు. ఇది నా అంచనా మాత్రమే కాదు. అందరి అంచానా కూడా. ఈ సీజన్‌లో అతడు బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణించాడు. అయితే ఈ ఏడాది సీజన్ ఆరంభానికి ముందు పాండ్యా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేయగలడా అన్న సందేహం అందరిలో నెలకొంది.
వాటిని పటాపంచలు చేస్తూ అతడు తన సత్తా ఎంటో చూపించాడు. ఏ ఆటగాడైనా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటే.. భవిష్యత్తులో భారత జట్టుకు కెప్టెన్‌గా అయ్యే అవకాశం ఉంటుంది. అయితే రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ రేసులో పాండ్యాతో పాటు ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు కూడా ఉన్నారు" అని గవాస్కర్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022 Winner: క్రెడిట్ మొత్తం ఆయనకేనన్న హార్దిక్.. అంతా అబద్ధం! కాదు నిజమే!
Comments
Please login to add a commentAdd a comment