
గుజరాత్ టైటాన్స్ పేసర్ యష్ దయాల్ తమ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపించాడు. తాను ఇప్పటి వరకు ఆడిన కెప్టెన్‌లలో పాండ్యానే అత్యుత్తమ సారథని అని యష్ దయాల్ తెలిపాడు. కాగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా ఎంపికయ్యాడు. అదే విధంగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో టీమిండియా వైస్ కెప్టెన్‌గా హార్ధిక్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఐపీఎల్ అరంగేట్ర సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌ను ఛాంపియన్స్‌గా నిలిపి హార్ధిక్ చరిత్ర సృష్టించాడు.
“హార్దిక్ పాండ్యా చాలా ప్రశాంతంగా ఉంటాడు. మ్యాచ్‌లో ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అతడికి బాగా తెలుసు. మనపై మనకు నమ్మకం ఉంటే అతడు మనల్ని స్వంత నిర్ణయాలు తీసుకునేలా సపోర్ట్ చేస్తాడు. అది బౌలర్‌లో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఇప్పటి వరకు ఆడిన కెప్టెన్‌లలో పాండ్యానే అత్యుత్తమ కెప్టెన్. అదే విధంగా ఆశిష్ నెహ్రా నాకు మొదటి నుంచి చాలా మద్దతుగా నిలిచాడు. టోర్నీ ఆరంభానికి ముందు నా బౌలింగ్‌లో రకరకాల ప్రయోగాలు చేసేవాడిని. కానీ ఆశిష్ సర్ నాకు ఒక సలహా ఇచ్చారు. మొదట ఓపెనర్లుకు ఒక విధంగా, డెత్ ఓవర్లలో సరైన ప్రణాళికతో బౌలింగ్ చేయమని చెప్పారు" అని యష్ దయాల్ పేర్కొన్నాడు.
చదవండి: William Porterfield Retirement: ఆటకు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ మూలస్థంభం