ఐపీఎల్ 15వ సీజన్ ఛాంపియన్స్‌గా హార్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అరంగేట్ర సీజన్‌లోనే టైటిల్ సాధించి గుజరాత్ చరిత్ర సృష్టించింది. ఇక ఈ ఏడాది సీజన్‌లో తిలక్ వర్మ, ఉమ్రాన్ మాలిక్ వంటి యువ ఆటగాళ్లు దుమ్ము రేపగా.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ క్రికెటర్‌లు తీవ్రంగా నిరాశపరిచారు. ఈ క్రమంలో ఐపీఎల్-2022లో తన బెస్ట్ ఎలెవన్‌ను భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రకటించాడు.
తన ఎంచుకున్న జట్టుకు హార్ధిక్ పాండ్యాను కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాను మాస్టర్ బ్లాస్టర్ నియమించాడు. అదే విధంగా ఓపెనర్లుగా జోస్ బట్లర్, శిఖర్ ధావన్‌ను ఎంపిక చేశాడు. వరుసగా మూడు నాలుగు స్థానాల్లో కేఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యాకు చోటు ఇచ్చాడు. ఐదు ఆరు స్థానాల్లో డేవిడ్ మిల్లర్, లియమ్ లివింగ్ స్టోన్‌కు చోటు దక్కింది.
ఏడో స్దానంలో ఫినిషర్‌గా డేవిడ్ మిల్లర్ అవకాశం ఇచ్చాడు. ఇక బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా రషీద్ ఖాన్‌కి చోటు దక్కింది. అదే విధంగా బౌలర్ల కోటాలో మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్‌ను లిటిల్ మాస్టర్ ఎంపిక చేశాడు. ఇక తన ప్రకటించిన జట్టులో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మకు చోటు దక్కలేదు.
సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ 2022 బెస్ట్ ఎలెవన్: జోస్ బట్లర్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, దినేష్ కార్తీక్, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.
చదవండి: Irfan Pathan Best XI Of IPL 2022: ఐపీఎల్ అత్యుత్తమ జట్టు ప్రకటన..కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా..!
Comments
Please login to add a commentAdd a comment