టీమిండియా ఆటగాడు దీపక్ హుడా గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడు. తనకు లభించిన తక్కువ అవకాశాల్లో అదరిపోయే ఆటతీరుతో అందరనీ అకట్టుకున్నాడు. ముఖ్యంగా ఐర్లాండ్ పర్యటనలో హుడా అత్యత్తుమ ప్రదర్శన కనబరిచాడు. ఈ సిరీస్‌లో సెంచరీతో చెలరేగిన హుడా.. 151 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ప్రస్తుతం దీపక్ విండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టులో భాగంగా ఉన్నాడు.
ఆదివారం విండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ విజయంలో ఆల్ రౌండ్ ప్రదర్శనతో హుడా తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో దీపక్ హుడాపై భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. రానున్న రోజుల్లో భారత జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్‌గా హుడా నిలుస్తాడని పఠాన్ కొనియాడాడు. "రెండేళ్ల క్రితం భారత జట్టులోకి వస్తానని హుడా అసలు ఊహించి ఉండడు. జట్టులోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే హుడా అదరగొడుతున్నాడు. అతడు జట్టులోకి రావడానికి చేసిన ప్రయత్నంలోనే సగం విజయం సాధించాడు.
అతడికి ఇప్పుడు కేవలం 27 ఏళ్ల మాత్రమే. భారత్ అతడిని సరిగ్గా ఉపయోగించుకుంటే మరో ఆరు ఏడేళ్ల పాటు తన సేవలు అందించగలడు. అతడు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రతిఫలం ఆశించి పనిచేస్తే ఎప్పుడూ నీవు రాణించలేవని గతంలో అతడితో చెప్పాను. జట్టు పరిస్థితులను బట్టి తన బ్యాటింగ్ స్ట్టైల్‌ను మార్చుకుంటాడు. ఎప్పుడూ నెమ్మదిగా ఆడాలో, ఎప్పుడు వేగంగా ఆడాలో అతడికి బాగా తెలుసు అని అని పఠాన్ పేర్కొన్నాడు.
చదవండి: Virat Kohli - Robin Uthappa: జట్టులో కోహ్లి స్థానం గురించి ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు! వీళ్లంతా అప్పుడేం చేశారు?
Comments
Please login to add a commentAdd a comment