
అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో దీపక్ హుడా భారత్ తరుపున వన్డేల్లో అరంగట్రేం చేశాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన దీపక్ హుడా 32 బంతుల్లో 26 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో రెండు బౌండరీలు ఉన్నాయి. కాగా తొలి వన్డేలో హుడాకి బౌలింగ్ చేసే అవకాశం రాలేదు. అయితే డెబ్యూ మ్యాచ్‌లో హుడా ఆడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో దీపక్ హుడాపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
హుడా అత్యత్తుమ ఆటగాడని అతడు కొనియాడాడు. అదే విధంగా తొలిసారిగా టీమిండియా క్యాప్ అందుకున్నందుకు దీపక్ హుడాను పఠాన్ అభినందించాడు. ఇక హుడా బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో ట్రాఫిక్‌లో ఇర్ఫాన్ చిక్కుకుపోయినప్పటికీ.. అతడి బ్యాటింగ్‌ను మాత్రం పఠాన్ మిస్ కాలేదు. కారులో కూర్చోని హుడా ఇన్నింగ్స్‌ను పఠాన్ వీక్షించాడు. దీనికి సంబంధించిన ఫోటోను ఇర్ఫాన్ ట్విటర్‌లో షేర్ చేశాడు. కాగా ఇర్ఫాన్ పఠాన్, దీపక్ హుడా ఇద్దరూ కూడా బరోడాకు చెందిన ఆటగాళ్లే కావడం విశేషం. ఇక భారత్-విండీస్ జట్ల మధ్య రెండో వన్డే బుధవారం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment