ముంబై వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న తొలి టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా పర్వాలేదనిపించింది. దీపక్ హుడా(41), ఇషాన్ కిషన్(37), అక్షర్ పటేల్(31) కీలక ఇన్నింగ్స్ ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నస్టానికి 162 పరుగులు చేసింది. కాగా హుడా, అక్షర్ పటేల్ కలిసి 68 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఇక టీ20లో అరంగేట్రం చేసిన యువ ఓపెనర్ శుబ్‌మాన్ గిల్(7) నిరాశపరిచాడు. అదే విధంగా విధ్వంసకర ఆటగాడు సూర్య కుమార్ యాదవ్(7) కూడా సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యాడు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 29 పరుగులతో రాణించాడు. ఇక శ్రీలంక బౌలర్లలో మధుషంక, థీక్షణ, కరుణరత్నే, డిసిల్వా, హసరంగా తలా వికెట్ సాధించారు.
చదవండి: IND vs SL: అతడు ఏం పాపం చేశాడు.. డ్రింక్స్ అందించడానికా సెలక్ట్ చేశారు?
Comments
Please login to add a commentAdd a comment