వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 టోర్నీలో ఫైనల్ బెర్త్‌ను ఇండియా ఛాంపియన్స్ ఖారారు చేసుకుంది. శుక్రవారం ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరిగిన సెమీఫైనల్లో 86 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ విధ్వంసం సృష్టించాడు.
ఆసీస్ బౌలర్లను పఠాన్ ఊచకోత కోశాడు. ఏడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పఠాన్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 19 బంతుల్లోనే పఠాన్ తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 50 పరుగులు చేసి పఠాన్ ఔటయ్యాడు.
ఇర్ఫాన్ పఠాన్‌తో పాటు రాబిన్ ఉతప్ప(65), యూసఫ్ పఠాన్(51), యువరాజ్ సింగ్(59) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరినలుగురి విధ్వంసకర ఇన్నింగ్స్ ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
అనంతరం 255 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 168 పరుగులకే పరిమితమైంది. ఆసీస్ బ్యాటర్లలో టిమ్ పైన్(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. ఇక శనివారం జరగనున్న ఫైనల్లో దాయాది పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment