PC: Cric Informer
ఐపీఎల్-2024లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో శివమ్ దూబే మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై దూబే విరుచుకుపడ్డాడు.
తన ట్రేడ్ మార్క్ షాట్లతో దూబే అలరించాడు. స్పిన్నర్లను దూబే టార్గెట్ చేశాడు. కేవలం 24 బంతుల్లో 4 సిక్స్‌లు , 2 ఫోర్లతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో దూబేపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. దూబే అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ కలిగి ఉన్నాడని పఠాన్ కొనియాడు.
"నేనే సెలక్టర్ అయితే శివమ్ దూబేను కచ్చితంగా టీ20 వరల్డ్‌కప్‌నకు ఎంపిక చేస్తాను. అతడికి అద్బుతమైన పవర్ హిట్టింగ్ స్కిల్స్ ఉన్నాయి. అంతే కాకుండా స్పిన్నర్లను చీల్చి చెండాడతున్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే స్పిన్నర్లను ఎటాక్ చేస్తున్నాడు. ఈ ఏడాది సీజన్‌లో కాకుండా గత ఏడాది సీజన్‌లో కూడా దూబే స్పిన్నర్లకు అద్బుతంగా ఆడాడు.
అటువంటి ఆటగాడు జట్టుకు అందుబాటులో ఉన్నప్పుడు ఎందుకు ఎంపికచేయరు? అతడి ఆటను సెలక్టర్లు చూస్తున్నరని నేను భావిస్తున్నాను. కాబట్టి టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఇవ్వండి. దూబే స్పిన్నర్లను మాత్రం కాదు ఫాస్ట్ బౌలర్లకు కూడా అద్బుతంగా ఆడుతాడు. అతడు ముంబై నుండి వచ్చాడని మర్చిపోవద్దు. ముంబైలో పిచ్‌లు ఎక్కువగా బౌన్స్ అవుతాయి. కాబట్టి అతడు పేసర్లను కూడా సమర్ధవంతంగా ఎదుర్కోగలడని" స్టార్ స్పోర్ట్స్ షోలో పఠాన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment