ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ లీగైన ఐపీఎల్ 2024 సీజన్‌కు మరో రెండు గంటల్లో తెరలేవనుంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్ షురూ కానుంది.
ఈ క్రమంలో ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరే నాలుగు జట్లను భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అంచనా వేశాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్‌తో పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయని తెలిపాడు.
"ప్రస్తుత జట్ల బలాలు, బలహీనతలను చూస్తే ఆ నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశముంది. అందులో మొదటిది ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ చాలా బలంగా కన్పిస్తోంది. ఆ తర్వాత రెండో జట్టు చెన్నై సూపర్ కింగ్స్. సీఎస్‌కేకు చాలా మంది స్టార్ ఆటగాళ్లు దూరంగా ఉన్నప్పటికి ఆ జట్టు మాత్రం ఎలాగైనా ముందుడగు వేస్తోంది.
డెవాన్ కాన్వే గాయం కారణంగా దూరమయ్యాడు. దీపక్ చాహర్ గాయం నుంచి కోలుకుని తిరిగివచ్చాడు. ఏదమైనప్పటికి ధోనీ చరిష్మాతో ముందుకు సాగుతోంది. ఎంఎస్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ తన అనుభవంతో జట్టును ముందుకు నడిపిస్తాడు. ఇక మూడో జట్టు లక్నో సూపర్ జెయింట్స్.
ఈ సారి లక్నో కూడా చాలా పటిష్టంగా కన్పిస్తోంది. రాహుల్ గాయం నుంచి కోలుకుని రావడం ఆ జట్టుకు కలిసిస్తోంది. చివరగా నాలుగో జట్టుగా కేకేఆర్ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించే ఛాన్స్ ఉంది. కేకేఆర్‌లో కూడా రస్సెల్, మంచి పవర్ హిట్టర్లు ఉన్నారని" స్టార్‌స్పోర్ట్స్ షోలో పఠాన్ పేర్కొన్నాడు. కాగా ఇర్ఫాన్ తన ఎంచుకున్న జట్లలో ఆర్సీబీ, ఎస్ఆర్‌హెచ్ పేర్లు లేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment