
Photo Courtesy: AFP
న్యూఢిల్లీ: ముంబై ఇండియన్స్ ప్రధాన పేస్ బౌలర్, యార్కర్ల స్పెషలిస్టు జస్‌ప్రీత్ బుమ్రాపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసలు కురిపించాడు. ఏ సందర్భంలోనైనా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసే బుమ్రాను బ్రేక్ త్రూ యాప్‌తో పోల్చాడు ఇర్పాన్. రాజస్థాన్ రాయల్స్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సునాయాసంగా విజయం సాధించగా, బుమ్రా నాలుగు ఓవర్లే వేసి వికెట్ తీయడమే కాకుండా 15 పరుగులు ఇవ్వడాన్ని ఇర్పాన్ ప్రస్తావించాడు.
‘బుమ్రా బ్రేక్ త్రూ యాప్ లాంటివాడు. నీకు వికెట్ కావాలనుకుంటే ‘బుమ్రా’ యాప్‌ను ఓపెన్ చేస్తావ్. అలాగే పరుగులు కట్టడి చేయాలన్నా బుమ్రానే. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కూడా అదే చూశాం. ముంబై ఇండియన్స్‌కు బుమ్రా ఆడుతున్న తొలి ఐపీఎల్ నుంచి అతనే అదే చేస్తూ వస్తున్నాడు’ అని ఇర్ఫాన్ కొనియాడాడు. ఇక బుమ్రా గురించి ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ మాట్లాడుతూ.. ‘అతను క్లాస్, ఫైర్‌పవర్ కల్గిన బౌలర్.
అతని యొక్క డిఫరెంట్ యాక్షన్ బ్యాట్స్‌మెన్‌కు కష్టంగా ఉంటుంది. అతను వేసే లైన్ అండ్ లెంగ్త్ బాల్స్ అన్నీ బుమ్రా కచ్చితత్వంతో వేస్తాడు కాబట్టే అసాధారణ బౌలర్ అయ్యాడు. బుమ్రా చేసేది మిగతా చాలా మంది బౌలర్లు చేయలేకపోతున్నారు. అతను వేసే యార్కర్లు అసలు తిరుగే ఉండదు’ అని ఐపీఎల్ బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు.
ఇక్కడ చదవండి: పుల్ షాట్ మాస్టర్‌కు హ్యాపీ బర్త్‌డే..!
విజయోత్సాహం: భార్యను ముద్దాడిన సూర్యకుమార్!
దురదృష్టంకొద్దీ మావి అలా వేయలేదు: పృథ్వీ షా