IPL 2021: 3 Memorable Debut Performances by Uncapped Indian Players - Sakshi
Sakshi News home page

IPL 2021 2nd Phase: అరంగేట్రంలోనే అదరగొట్టిన ఆటగాళ్లు వీరే

Published Tue, Sep 21 2021 4:18 PM | Last Updated on Tue, Sep 21 2021 7:37 PM

IPL 2021: 3 Memorable Debut Performances By Uncapped Indian Players - Sakshi

Courtesy: IPL. Com

Debut Performances By Uncapped Indian Players.. ఐపీఎల్‌ లాంటి లీగ్‌ వల్ల చాలా మంది ఆటగాళ్లు పరిచయమవ్వడమే గాక జాతీయ జట్టులో ఆడేందుకు అవకాశాలు తలుపు తట్టాయి. అలాంటి ఐపీఎల్‌ కొందరికి వెలుగునివ్వగా.. మరికొందరు రాణించినప్పటికి దేశవాలికే పరిమితమయ్యారు. జాతీయ జట్టుకు ఆడకుండానే ఐపీఎల్‌లో డెబ్యూ మ్యాచ్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లు కొందరు ఉన్నారు. తాజాగా ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా ఆర్‌సీబీ, కేకేఆర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌ డెబ్యూ మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఇక అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా ఐపీఎల్‌లో అదరగొట్టిన ఆటగాళ్లను ఇప్పుడు చూద్దాం. 

చదవండి: PBKS Vs RR: వారిద్దరు ఓపెనర్స్‌గా వస్తే గెలుపు అవకాశాలు ఎక్కువ

జస్‌ప్రీత్‌ బుమ్రా(2013, ముంబై ఇండియన్స్‌)


Courtesy: Mumbai Indians

బుమ్రా ఇప్పుడంటే టీమిండియా స్టార్‌ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే బుమ్రాకు గుర్తింపు రావడానికి మాత్రం ఐపీఎల్‌ ఒక కారణమని చెప్పొచ్చు. టీమిండియాకు ఆడకముందు 2013లో ముంబై ఇండియన్స్‌ తరపున బుమ్రా డెబ్యూ మ్యాచ్‌ ఆడాడు. ఆర్‌సీబీతో జరిగిన ఆ మ్యాచ్‌లో మూడు వికెట్లతో రాణించాడు. బుమ్రా తాను వేసిన తొలి బంతిని కోహ్లి బౌండరీ తరలించగా.. తరువాతి బంతికే కోహ్లిని అవుట్‌ చేసి ఐపీఎల్‌లో తొలి వికెట్‌ దక్కించుకున్నాడు. ఆ తర్వాత మయాంక్‌ అగర్వాల్‌, కరుణ్‌ నాయర్‌లను పెవిలియన్‌ చేర్చిన బుమ్రా ఓవరాల్‌గా 4 ఓవర్లు వేసి 32 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు. కానీ ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ రెండు పరుగుల తేడాతో ఓటమి పాలయింది. అలా తొలి మ్యాచ్‌లోనే తన బౌలింగ్‌తో ఆకట్టుకున్న బుమ్రా ప్రస్తుతం టీమిండియా జట్టులో కీలక బౌలర్‌గా మారాడు. 

స్వప్నిల్‌ అస్నోడ్కర్‌(2008, రాజస్తాన్‌ రాయల్స్‌)


Courtesy: IPL. Com

ఐపీఎల్‌ తొలి సీజన్‌(2008)లో రాజస్తాన్‌ రాయల్స్‌ చాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన రాజస్తాన్‌ టైటిల్‌ గెలవడం వెనుక గోవా కుర్రాడు స్వప్నిల్‌ అస్నోడ్కర్‌ పాత్ర చాలా ఉంది. అప్పటి రాజస్తాన్‌ కెప్టెన్‌ షేన్‌ వార్న్‌ అస్నోడ్కర్‌పై నమ్మకముంచి ఓపెనింగ్‌ స్థానంలో పంపించాడు. అలా కేకేఆర్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అస్నోడ్కర్‌ మంచి ప్రదర్శన కనబరిచాడు.  34 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 60 పరుగులు చేశాడు. అతని దెబ్బకు రాజస్తాన్‌ 196 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ 45 పరుగులతో విజయాన్ని అందుకుంది. గ్రేమి స్మిత్‌కు జతగా  ఓపెనర్‌గా వచ్చిన అస్నోడ్కర్‌ తొమ్మిది మ్యాచ్‌ల్లో 311 పరుగులు సాధించాడు.

చదవండి: KKR vs RCB: డెస్సింగ్‌రూంలో సంబరాలు.. మేం మిమ్మల్ని ఓడించగలం

వెంకటేశ్‌ అయ్యర్‌(2021, కోల్‌కతా నైట్‌రైడర్స్‌)


Courtesy: KKR

తాజాగా ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ ఆకట్టుకున్నాడు. డెబ్యూ మ్యాచ్‌లోనే శుబ్‌మన్‌ గిల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతను (41 పరుగులు నాటౌట్‌) చివరి వరకు నిలిచి మ్యాచ్‌ను గెలిపించాడు. 27 బంతుల్లో 41 పరుగులు చేసిన వెంకటేశ్‌ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. ఆర్‌సీబీపై గెలవడంలో కీలక పాత్ర పోషించిన వెంకటేశ్‌ అయ్యర్‌ రానున్న మ్యాచ్‌ల్లో కేకేఆర్‌కు కీలకంగా మారనున్నాడు.

చదవండి: Suresh Raina Wicket: అయ్యో రైనా.. వికెట్‌తో పాటు బ్యాట్‌ను విరగొట్టుకున్నాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement